Narasapuram: గుర్రపు డెక్కతో అద్భుత కళాఖండాలు: నరసాపురంలో మహిళల ప్రతిభ

Narasapuram: గుర్రపు డెక్క వ్యర్థాలతో అద్భుత కళాఖండాలు తయారు చేసిన మహిళా హస్తకళాకారులను నరసాపురం క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ అభినందించారు.

POTHUMUDI MUTYALU, NARASAPURAM
Published on: 6 Oct 2026 6:08 PM IST
Narasapuram
X

Narasapuram: గుర్రపు డెక్కతో అద్భుత కళాఖండాలు: నరసాపురంలో మహిళల ప్రతిభ

Narasapuram: ఈరోజు నరసాపురం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ని పలువురు మహిళా హస్త కళాకారుల కార్మికులు మర్యాదపూర్వకంగా కలిశారు.

కేంద్ర జౌళి శాఖ సహకారంతో నిర్వహించిన వర్క్ షాప్ లో శిక్షణ పొందిన వీరు.. గుర్రపు డెక్క ఉపయోగించి అద్భుతంగా తీర్చిదిద్దిన క్యారీ బ్యాగులు, బుక్ స్టాండ్స్, బొకేలు, ల్యాంప్స్ వంటి వివిధ రకాల హస్తకళలను ఎమ్మెల్యే గారికి చూపించారు.

తమ స్వయంకృషితో అద్భుతమైన వస్తువులను తయారు చేసిన మహిళల నైపుణ్యాన్ని, వారి కష్టాన్ని ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ హస్తకళల ద్వారా మరింత ఉపాధి పొందుతూ, ఆర్థికంగా ఎదిగేందుకు వీలుగా వారికి పలు అమూల్యమైన సూచనలు అందజేశారు.

POTHUMUDI MUTYALU, NARASAPURAM

POTHUMUDI MUTYALU, NARASAPURAM