Aswaraopeta: అశ్వారావుపేటలో ఘనంగా ముగిసిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు!

Aswaraopeta: రాష్ట్రస్థాయి అండర్-20 బాలికల కబడ్డీ పోటీలు ముగిశాయి. నల్గొండ జట్టు ప్రథమ బహుమతి గెలుచుకుంది. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆతిథ్యం ప్రత్యేక ఆకర్షణ.

SANKURATHRI SATISH, ASWARAOPETA
Published on: 13 Oct 2026 8:08 AM IST
Aswaraopeta
X

Aswaraopeta: అశ్వారావుపేటలో ఘనంగా ముగిసిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు!

Aswaraopeta: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారి అధ్యక్షతన అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో ఇండోర్ మినీ స్టేడియంలో మూడు రోజులుగా నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్‌-20 బాలికల కబడ్డీ పోటీలు ఘనంగా ముగిశాయి రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారిణులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు రాష్ట్ర మాజీ ఇరిగేషన్ కార్పొరేషన్ డెవలప్‌మెంట్ చైర్మన్ మువ్వ విజయబాబు కూడా కార్యక్రమానికి హాజరై క్రీడాకారిణులను అభినందించారు.

మూడు రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగిన పోటీల్లో నల్గొండ జిల్లా జట్టు ప్రథమ బహుమతి సాధించగా రంగారెడ్డి జిల్లా జట్టు ద్వితీయ బహుమతి గెలుచుకుంది భద్రాద్రి కొత్తగూడెం మేడ్చల్ జిల్లా జట్లు సంయుక్తంగా తృతీయ బహుమతి సాధించాయి విజేత జట్లకు అతిథులు బహుమతులు అందజేసి క్రీడాకారిణులను అభినందించారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు క్రీడా సంఘాల ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పోటీల నిర్వహణలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరి సేవలను గుర్తించి సన్మానించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు

క్రీడాకారిణులకు ఆత్మీయ ఆతిథ్యం.. మాధురి రెడ్డి గారి అభినందనలు

ముగింపు కార్యక్రమంలో శ్రీమతి మాధురి రెడ్డి గారు క్రీడాకారిణులను అభినందిస్తూ క్రీడల్లో గెలుపోటములు సహజమని పట్టుదలతో సాధన చేస్తూ ముందుకు సాగాలని సూచించారు క్రీడలు బాలికల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి దోహదపడతాయని పేర్కొన్నారు క్రీడాకారిణులకు మంచి వసతి భోజనం ఆత్మీయ వాతావరణం కల్పించి పోటీలను విజయవంతం చేసిన ఎమ్మెల్యే గారిని అభినందించారు

సొంత పిల్లల్లా చూసుకున్నారు.. మళ్లీ మళ్లీ ఇక్కడికే రావాలనిపిస్తోంది

ఈ పోటీల్లో పాల్గొన్న వివిధ జిల్లాల కెప్టెన్లతో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రత్యేకంగా మాట్లాడించి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు అశ్వారావుపేటలో కల్పించిన సౌకర్యాలు ఆతిథ్యం గురించి క్రీడాకారిణులు తమ అభిప్రాయాలను వెల్లడించారు

తమను సొంత పిల్లల్లా చూసుకున్నారని మంచి భోజనం అందించారని సౌకర్యవంతమైన వసతి కల్పించారని ఇంత ఆప్యాయంగా ఆదరించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని క్రీడాకారిణులు పేర్కొనడం విశేషం అశ్వారావుపేటలో గడిపిన రోజులు మధురమైన అనుభూతిని ఇచ్చాయని మళ్లీ మళ్లీ ఇక్కడికి వచ్చి ఆడాలని ఉందని ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లాలంటే బాధగా ఉందని వారు చెప్పడం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది

ఈ కార్యక్రమంలల్లో పాలు పంచుకొని, ఎంతో సహకరించిన రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భార్య మాధురి రెడ్డి గారికి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ధన్యవాదములు తెలిపారు

SANKURATHRI SATISH, ASWARAOPETA

SANKURATHRI SATISH, ASWARAOPETA