Tanuku: తణుకులో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: ఆరిమిల్లి శ్రీనివాస్

Tanuku: తణుకు మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఈ నెల 5న పోలింగ్, 7న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల ఆర్వో ఆరిమిల్లి శ్రీనివాస్ తెలిపారు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 3 Nov 2026 5:23 PM IST
Tanuku
X

Tanuku: తణుకులో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: ఆరిమిల్లి శ్రీనివాస్

తణుకు: తణుకు మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆరిమిల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 5న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎంపీటీసీ జడ్పిటిసి పోలింగ్ జరుగుతుందని వెల్లడించారు.

పోలింగ్ ముగిసిన అనంతరం తాడేపల్లిగూడెం ఆదికవి నన్నయ ఫార్మసీ కళాశాలలో పోలైన బ్యాలెట్ పత్రాలను భద్రపరిచి ఈనెల 7న ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి 10 టేబుల్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. వీటిలో ఎంపీటీసీ ఐదు టేబుల్లు, జడ్పిటిసికి సంబంధించి ఐదు టేబుల్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ నిఘాలో పోలింగ్..

తణుకు మండలంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు 57 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసామని తెలిపారు. వీటిలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 17 గుర్తించి వాటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. మిగిలిన 43 పోలింగ్ కేంద్రాల్లో ఇంజనీరింగ్ విద్యార్థుల సహకారంతో వెబ్ కాస్టింగ్ సౌకర్యం కల్పించామన్నారు. పోలింగ్ నిర్వహణకు 285 మంది సిబ్బందిని నియమించామని వెల్లడించారు.

నేడు ఎన్నికల సామాగ్రి పంపిణీ..

ఎన్నికల నిర్వహణకు హాజరయ్యే సిబ్బంది ఈ నెల 4న ఉదయం 8 గంటలకు తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వద్దకు వచ్చి ఎన్నికల సామగ్రిని తీసుకోని పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించామని తెలిపారు. ఈనెల 6 తేదీ సాయంత్రం 6 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఇప్పటివరకు 58 మంది సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకున్నారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)