Mogalthur: అధ్వానంగా రోడ్డు - అధికారులకు మహిళల వినతి

Mogalthur: మొగల్తూరు నుంచి వెంప మీదుగా భీమవరం వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారడంతో మహిళల నిరసన. కలెక్టర్, ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత.

Padala Chiranjeevi Reddy, Staff Reporter -East Godavari
Published on: 18 Sept 2026 5:15 PM IST
Mogalthur
X

Mogalthur: అధ్వానంగా రోడ్డు - అధికారులకు మహిళల వినతి

మొగల్తూరు: పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు నుంచి వెంప మీదుగా భీమవరం వెళ్లే ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారి అధ్వానంగా మారడంపై పడమటిపాలెం గ్రామానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో ధర్నా నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా రోడ్డు గుంతలమయంగా మారడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ రోడ్డు పరిస్థితి మాత్రం మారడం లేదని, నిత్యం వాహనాల రాకపోకలు అధికంగా ఉండే ఈ రహదారిపై ప్రయాణించాలంటేనే భయంగా ఉందని తెలిపారు. ఇటీవల మొగల్తూరులో పర్యటించిన మంత్రి నారా లోకేష్ కొత్త రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు , రెండేళ్లు గడిచినా పనులు ప్రారంభం కాలేదని మహిళలు పేర్కొన్నారు.

వెంటనే రోడ్డు వెయ్యాలని , లేదంటే రోడ్డుపై బైఠాయించి ఆందోళనను ఉధృతం చేస్తామని అన్నారు,అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌కు వినతిపత్రం అందజేశారు. సమస్యను పరిశీలించి త్వరితగతిన పరిష్కరిస్తామని కలెక్టర్, ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Padala Chiranjeevi Reddy, Staff Reporter -East Godavari

Padala Chiranjeevi Reddy, Staff Reporter -East Godavari

తూర్పు గోదావరి జిల్లాలో 13 సంవత్సరాల నమ్మకమైన జర్నలిజం ప్రయాణం. నిఖార్సైన వార్తలు, లోతైన విశ్లేషణలతో సాగుతున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.