Yalamanchili: మొల్లేటి చంద్రరావు కుటుంబానికి ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ పరామర్శ

Yalamanchili: లక్ష్మిపాలెం గ్రామానికి చెందిన మొల్లేటి చంద్రరావు చిత్రపటానికి ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

S VENKAT, PALAKOLLU
Published on: 29 Sept 2026 7:17 PM IST
Yalamanchili
X

Yalamanchili: మొల్లేటి చంద్రరావు కుటుంబానికి ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ పరామర్శ

Yalamanchili: యలమంచిలి మండలం లక్ష్మిపాలెం గ్రామానికి చెందిన మొల్లేటి చంద్రరావు గారు ఇటీవలే స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకుని నిన్నటి రోజున వారి స్వగృహానికి చేరుకుని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన శాసన మండలి సభ్యులు మరియు రాష్ట్ర శెట్టిబలిజ విభాగ అధ్యక్షులు కవురు శ్రీనివాస్, మండల కన్వీనర్ ఉచ్చుల స్టాలిన్, మాజీ ఎంపీపీ ఇనుకొండ ధనలక్ష్మి రవి, గ్రామ మాజీ సర్పంచ్ ఘాటిగంటి మహేష్, గ్రామ పార్టీ అధ్యక్షులు మల్లాడి ఏడుకొండలు, మాజీ సర్పంచ్ లు వల్లభు నరసింహారావు, కవురు గోపి, మాజీ ఎంపీటీసీ ఏడుకొండలు, తదితర పెద్దలు గ్రామ పార్టీ నేతలు పాల్గొన్నారు.

S VENKAT, PALAKOLLU

S VENKAT, PALAKOLLU