Konaseema: ఆత్రేయపురం డ్రాగన్ బోట్ ఫెస్టివల్‌కు జాతీయ స్థాయి గుర్తింపు!
Konaseema: ఆత్రేయపురం డ్రాగన్ బోట్ ఫెస్టివల్‌ను వార్షిక ఈవెంట్‌గా నిర్వహించేందుకు ఐకేసీఏ ఆమోదం తెలిపింది.
Konaseema: ఆత్రేయపురం డ్రాగన్ బోట్ ఫెస్టివల్‌కు జాతీయ స్థాయి గుర్తింపు!
Konaseema: ఆత్రేయపురంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి వేడుకల సందర్భంగా నిర్వహించే డ్రాగన్ బోట్ ఫెస్టివల్ కు ఇండియన్ కయాకింగ్ అండ్ కెనోయింగ్ అసోసియేషన్ (ఐకెసిఏ) అధికారికంగా ఆమోదం తెలిపినట్టు జాయింట్ సెక్రటరీ మరియు వాటర్ స్పోర్ట్స్ ప్రెసిడెంట్ బలరామ నాయుడు మరియు జిల్లా పర్యటక అధికారి అన్వార్ తెలిపినట్టు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుని వాడపాలెం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద కలిసి వెల్లడించారు.
కెనోయింగ్ అండ్ కయాకింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (సికెఏఏపి) చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన ఐకెసిఏ, ఆత్రేయపురం డ్రాగన్ బోట్ ఫెస్టివల్ ను వార్షిక ఈవెంట్ గా నిర్వహించడానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం జనవరి 13 నుండి 15 వరకు సంక్రాంతి వేడుకల్లో భాగంగా జరుగుతుంది.
ఇకనుండి ఈ పోటీలు ఐకెసిఏ నియమ నిబంధనల ప్రకారం నిర్వహించబడతాయి. ఈ గుర్తింపు ద్వారా ఆత్రేయపురం ఫెస్టివల్ కు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత లభించడంతో పాటు, ఆంధ్రప్రదేశ్ లో డ్రాగన్ బోట్, కయాకింగ్, కెనోయింగ్ క్రీడలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు. ప్రజల భాగస్వామ్యం పెంచి, యువతలో క్రీడలపై అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొనడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే సత్యానందరావు తెలిపారు.అలాగే రాబోయే బోట్ ఫెస్టివల్ గురించి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆత్రేయపురం మండల పార్టీ అధ్యక్షులు కొసంపూడి రామకృష్ణరాజు, దండు శివ మరియు వేత్స అనిల్ పాల్గొన్నారు.




