Tanuku: తణుకులో 57 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత!

Tanuku: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 57 మంది లబ్ధిదారులకు రూ.48.55 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 18 Sept 2026 4:41 PM IST
Tanuku
X

Tanuku: తణుకులో 57 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత!

Tanuku: పేదల ఆరోగ్యానికి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తణుకు నియోజకవర్గానికి చెందిన 57 మంది లబ్ధిదారులకు రూ.48,55,285 విలువైన చెక్కులను శుక్రవారం ఆయన పంపిణీ చేసి మాట్లాడారు.

ఆపద సమయంలో అండగా నిలుస్తూ, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక భరోసా కల్పించడం ఎంతో ఉపశమనాన్ని అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పరిమి వెంకన్నబాబు, తెదేపా పట్టణ అధ్యక్షుడు కలగర వెంకటకృష్ణ, మా జీ ఏఎంసీ చైర్మన్ బసవ రామకృష్ణ, పితాని మోహన్ రావు కూటమి నాయకులు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)