Palakollu: పాలకొల్లులో ఆల్ ఇండియా సీనియర్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభం!
Palakollu: పాలకొల్లులో ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. 6 రోజుల పాటు పోటీలు.
Palakollu: పాలకొల్లులో ఆల్ ఇండియా సీనియర్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభం!
Palakollu: పాలకొల్లులో ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ పోటీలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. పాలకొల్లు కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో సీహెచ్ బుద్ధ అవతారం రాజు పేరిట ఆరు రోజుల పాటు టెన్నిస్ పోటీలు జరగనున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి టోర్నమెంట్‌కు సీనియర్ టెన్నిస్ క్రీడాకారులు హాజరయ్యారు. ఆరోగ్య పరిరక్షణకు, శారీరక దారుఢ్యానికి క్రీడలు ఎంతో దోహదపడతాయి అనీ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. యువత చెడు మార్గాల్లో పయనించకుండా క్రీడలు దోహదపడతాయి.. క్రీడా స్ఫూర్తితో పాటు క్రమశిక్షణ, పట్టుదల అలవడతాయి అనీ క్రీడా పోటీలతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సేవలు అభినందనీయం అనీ సీనియర్ క్రీడాకారులకు వేదిక కల్పించడం ద్వారా క్రీడల అభివృద్ధికి నిర్వాహకులు చేస్తున్న కృషి ప్రశంసనీయం అనీ రామానాయుడు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత ప్రభుత్వం తీవ్ర అప్పుల భారంలోకి నెట్టి వారసత్వంగా అప్పగించిందనీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందనీ పాలకొల్లు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా, అగ్రగామిగా నిలిపేందుకు అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నాను అనీ మంత్రి రామానాయుడు అన్నారు.




