Tanuku: మహిళ దాడిలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి!
Tanuku: తణుకు మండలం కొమరవరంలో ఆర్థిక లావాదేవీల ఘర్షణలో మహిళ దాడికి గురైన పాల నాగరాజు చికిత్స పొందుతూ మృతి. తణుకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు.
Tanuku: మహిళ దాడిలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి!
Tanuku: మహిళా చేతిలో దాడికి గురైన వ్యక్తి ప్రైవేట్ హాస్పిటలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. తణుకు మండలం కొమరవరం గ్రామానికి చెందిన పాల నాగరాజు (44)కు సమీపంలో ఉన్న పాల శిరీషకు ఆర్థిక లావాదేవీల విషయంలో శుక్రవారం రాత్రి వారి ఇంటి వద్ద ఘర్షణ పడ్డారు. నాగరాజు భార్య పాల రత్న కుమారి శిరీష భర్త దుర్గ ప్రసాద్ కొంత బంగారం నగదు ఇచ్చింది.
ఈ క్రమంలో తన భార్య ఇచ్చిన నగదు, బంగారం తనకు ఇవ్వాలని శిరీషను నాగరాజు అడగడంతో ఇద్దరి మధ్య ఘర్షణ ఏర్పడింది. దీంతో శిరీష ఆగ్రహించి చాకుతో నాగరాజు పై దాడి చేయడంతో చేతి మనికట్టు భాగంలో బలమైన గాయమైంది. దింతో అధిక రక్త స్రావంతో ఘటనా స్థలంలో బాధితుడు కొట్టుమిట్టు ఆడడంతో స్థానికులు నాగరాజుని తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం నిమిత్తం తణుకులో ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. ఈ సంఘటనపై తణుకు గ్రామీణ సీఐ దేశంశెట్టి వెంకటేశ్వరరావు, గ్రామీణ ఎస్సై నాలం శ్రీనివాస్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో పంచనామ చేసి బంధువులకు అప్పగించారు.




