Palakollu: రంగా కుటుంబానికి మాల మహానాడు సంపూర్ణ మద్దతు!
Palakollu: లంకెలకోడేరులో మాల మహానాడు సమావేశం: రంగా అందరివాడు, ఆయన కుటుంబానికి అన్నివేళలా అండగా ఉంటామని రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ వెల్లడి, నూతన కమిటీల ఎన్నిక.
Palakollu: రంగా కుటుంబానికి మాల మహానాడు సంపూర్ణ మద్దతు!
పాలకొల్లు: మాలమహానాడు సమావేశం లంకెలకోడేరు రాజీవ్ కాలనీ పాతకమ్యూనిటీ హాలు దగ్గర జరిగింది. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వంగవీటి మోహన రంగాకు కులం ఆపాదించడం సరికాదని, రంగా అందరివాడని నల్లి రాజేష్ అన్నారు.
వదళితుల పక్షాన రంగా నిలబడి అండగా నిలబడి పోరాడిన విషయాన్ని దళితులు ఎప్పటికి మర్చిపోరని . దళితుల పక్షాన నిలబడి రంగా ఎంతో సేవ చేశారని కొనియాడారు. రంగా కుటుంబానికి మాలమహానాడు అన్నివేళలా అండగా ఉంటుందని రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో భాగంగా నల్లి రాజేష్ మాలమహానాడు లంకలకోడేరు గ్రామ కమిటీని పలువురు మండల కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు,
నూతన కమిటీ
ఏలూరి రాజ్ కమల్ గ్రామ అధ్యక్షులు, బందెల పృధ్వీరాజ్ గ్రామ కార్యదర్శి, చొప్పుల వెంకట్రావు మండల కార్యదర్శి, బద్దా సంపద రావు గ్రామ ఉపాధ్యాక్షులు, అడిదెల తేజ సంయుక్త కార్యదర్శి.
ఈ కార్యక్రమలో రాష్ట్ర కార్యదర్శిలు కర్ని జోగయ్య, మర్రె సామ్యూల్, జిల్లా అధ్యక్షులు గుండె నగేష్ బాబు, జిల్లా కోశాధికారి ఏనుగుపల్లి చంద్రశేఖర్,జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి పాలపర్తి కృపానాథ్, జిల్లా సంయుక్త కార్యద్ఫర్సి తోకల జనార్ధన్, జిల్లా కార్యదర్శి విప్పర్తి నవీన్, పాలకొల్లు మండల అధ్యక్షులు గుమ్మాపు రవి, పా లకొల్లు మండల మహిళ అధ్యక్షురాలు చిలకపాటి మేరిరత్నం, పాలకొల్లు నియోజకవర్గ కార్యదర్శి కొయ్యే లక్ష్మణరావు, పాలకొల్లు మండల యూత్ ప్రెసిడెంట్ మందపాటి జోసెఫ్ రాజు, పోడూరు మండల యూత్ ప్రెసిడెంట్ సరెళ్ళ రఘు, జిల్లా కార్యదర్శి పోనుకుమట్ల వీరస్వామి , పాలకొల్లు నియోజక వర్గ సంయుక్త కార్యదర్శిలు కప్పల కోటేశ్వరరావు, సరెళ్ళ రామారావు, మొదలగువారు పాల్గొన్నారు.




