Penugonda: పెనుగొండలో ఎక్సైజ్ శాఖ నిఘా: 16 మంది బైండోవర్
Penugonda: స్థానిక ఎన్నికల వేళ పెనుగొండ మండలంలో 16 మంది ఎక్సైజ్ పాత నిందితులను తహసీల్దార్ ఎదుట రూ.లక్ష పూచీకత్తుపై ఎక్సైజ్ శాఖ బైండోవర్ చేసింది.
Penugonda: పెనుగొండలో ఎక్సైజ్ శాఖ నిఘా: 16 మంది బైండోవర్
పెనుగొండ: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ముందస్తు చర్యలు ముమ్మరం చేసింది. పెనుగొండ మండలంలో గతంలో మద్యం అక్రమ రవాణా, గంజాయి తదితర ఎక్సైజ్ నేరాల్లో నిందితులుగా ఉన్న 16 మందిని గుర్తించి, తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున సొంత పూచీకత్తుపై విడుదల చేస్తూ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల సమయంలో అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు పార్సిల్ కార్యాలయాలు, బస్టాండ్లు, జాతీయ రహదారులపై తనిఖీలు ముమ్మరం చేసినట్లు తణుకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్. మణికంఠ రెడ్డి తెలిపారు.




