Tanuku: చంద్రబాబు జూమ్ భేటీలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆరిమిల్లి
Tanuku: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని సీఎం చంద్రబాబు నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు.
Tanuku: చంద్రబాబు జూమ్ భేటీలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆరిమిల్లి
Tanuku: తెదేపా జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో తణుకు ఎమ్మెల్యే, జోనల్ కోఆర్డినేటర్ ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని చంద్రబాబు సూచించారు.
కూటమి అభ్యర్థుల విజయానికి క్షేత్రస్థాయిలో సమష్టి కృషి అవసరమని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో బీసీలకు పార్టీ పరంగా 34 శాతం రిజర్వేషన్లు కల్పించినందుకు చంద్రబాబుకి ఎమ్మెల్యే రాధాకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.




