Narasapuram: తూర్పుతాళ్లులో భారీ ర్యాలీతో సర్పంచ్ అభ్యర్థి కె.వి.ఆర్. నామినేషన్!

Narasapuram: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాళ్లు సర్పంచ్ కూటమి అభ్యర్థిగా కరీంశెట్టి వెంకటేశ్వరరావు (కె.వి.ఆర్.) భారీ ర్యాలీతో నామినేషన్ వేశారు.

POTHUMUDI MUTYALU, NARASAPURAM
Published on: 16 Nov 2026 8:16 PM IST
Narasapuram
X

Narasapuram: తూర్పుతాళ్లులో భారీ ర్యాలీతో సర్పంచ్ అభ్యర్థి కె.వి.ఆర్. నామినేషన్!

పశ్చిమగోదావరి జిల్లా: నరసాపురం మండలం తూర్పుతాళ్లు గ్రామ సర్పంచ్ కూటమి అభ్యర్థిగా కరీంశెట్టి వెంకటేశ్వరరావు (కె.వి.ఆర్.) భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు. సుమారు 500 మంది అనుచరులు, కార్యకర్తలు, గ్రామస్థులతో ర్యాలీగా బయలుదేరి స్థానిక గ్రామ సచివాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు.

ఈ సందర్భంగా కె.వి.ఆర్. మాట్లాడుతూ.. తన తండ్రి సత్యనారాయణ గతంలో సుదీర్ఘ రాజకీయ అనుభవంతో సర్పంచ్‌గా పనిచేస్తూ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ప్రజల పట్ల తండ్రికి ఉన్న నిబద్ధత, ప్రజాసేవ తనకు చిన్నతనం నుంచే స్ఫూర్తినిచ్చాయని పేర్కొన్నారు. తండ్రి ఆశయాలే లక్ష్యంగా పెట్టుకుని గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు.

POTHUMUDI MUTYALU, NARASAPURAM

POTHUMUDI MUTYALU, NARASAPURAM