West Godavari: ఓటమితో వెనకడుగు వేయను.. ప్రజలకు అండగా ఉంటా!

West Godavari: నరసాపురం మండలం లక్ష్మనేశ్వరం సర్పంచ్ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడినా, 14 వార్డుల్లో 9 గెలిచి ఉపసర్పంచిగా నామినేట్ అయినట్లు మల్లిపూడి లక్ష్మీ ప్రసన్న తెలిపారు.

POTHUMUDI MUTYALU, NARASAPURAM
Published on: 29 Nov 2026 12:36 PM IST
West Godavari
X

West Godavari: ఓటమితో వెనకడుగు వేయను.. ప్రజలకు అండగా ఉంటా! 

West Godavari: లక్ష్మనేశ్వరం కూటమి అభ్యర్థి మల్లిపూడి చిన్నబాబు లక్ష్మీ ప్రసన్నపశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మనేశ్వరం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన మల్లిపూడి చిన్నబాబు లక్ష్మీ ప్రసన్న స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.

గ్రామంలోని 14 వార్డులకు గాను 9 వార్డులను కైవసం చేసుకున్నామని, ఉపసర్పంచిగా తనను నామినేట్ చేసినట్లు స్పష్టం చేశారు. నామినేషన్ వేసిన రోజు నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.ఎన్నికల బరిలో నిలిచిన తర్వాత గెలుపోటములు సహజమని, ఓటమితో తాను వెనకడుగు వేసేది లేదని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో అండగా నిలిచిన గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ భరోసాగా ఉంటానని హామీ ఇచ్చారు. చివరి నిమిషం వరకు ప్రజలతోనే ఉంటానని, గ్రామంలోని సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు.

POTHUMUDI MUTYALU, NARASAPURAM

POTHUMUDI MUTYALU, NARASAPURAM