Penumantra: గరువు సర్పంచ్ అభ్యర్థి చిటకన శేషు ప్రచారం.. కత్తెర గుర్తు
Penumantra: పెనుమంట్ర మండలం గరువు గ్రామ సర్పంచ్ అభ్యర్థి చిటకన శేషు ప్రచారం; కత్తెర గుర్తుపై ఓటేసి గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తానని హామీ.
Penumantra: గరువు సర్పంచ్ అభ్యర్థి చిటకన శేషు ప్రచారం.. కత్తెర గుర్తు
పెనుమంట్ర: పెనుమంట్ర మండలం గరువు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా చిటకన శేషు పోటీ చేస్తున్నారు. కూటమి పార్టీల మద్దతుతో ఆమె పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఆమెకు కేటాయించిన కత్తెర గుర్తుపై గ్రామస్తులు ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని తాను సర్పంచిగా గెలుపొందాక, కొద్ది కాలవ్యవధిలోని వాటన్నిటినీ పరిష్కరిస్తానన్నారు.
రహదారులు, మంచినీటి సరఫరా, స్మశాన వాటిక, ఇతర మౌలిక సదుపాయాలపై తాను దృష్టి సాదిస్తానన్నారు. ఈనెల 26వ తేదీన జరగబోయే ఎన్నికల్లో కత్తెర గుర్తుపై ఓట్లు వేయాలని కోరారు. ఇప్పటికి తాను గ్రామంలో ప్రచారం చేస్తుంటే గ్రామస్తుల నుంచి విశేష స్పందన వస్తుందని తెలిపారు.




