Narsapuram: నరసాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా కొత్తపల్లి శైలజ నామినేషన్!

Narsapuram: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా కొత్తపల్లి శైలజ భారీ ర్యాలీతో తరలివెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.

POTHUMUDI MUTYALU, NARASAPURAM
Published on: 18 Oct 2026 5:19 PM IST
Narsapuram
X

Narsapuram: నరసాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా కొత్తపల్లి శైలజ నామినేషన్!

Narsapuram: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి శైలజ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో భాగంగా తొలుత గోగులమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా తన నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. కొత్తపల్లి శైలజ నామినేషన్ కార్యక్రమంతో నరసాపురం మున్సిపల్ ఎన్నికల రాజకీయాలు మరింత వేడెక్కాయి. ర్యాలీలో కుటుంబ సభ్యులు మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్, కొత్తపల్లి నాని లతోపాటు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ, తెదేపా నేతలు పొత్తూరి రామరాజు, కొవ్వలి రామ్మోహన్ నాయుడు, నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు

POTHUMUDI MUTYALU, NARASAPURAM

POTHUMUDI MUTYALU, NARASAPURAM