Koonavaram: ఘనంగా ఏబీ ఫౌండేషన్ ప్రారంభం నిరుపేదలకు సాయం
Koonavaram: కూనవరంలో ఏబీ ఫౌండేషన్ ప్రారంభోత్సవంలో భాగంగా నిరుపేద కొండారెడ్డి కుటుంబాలకు భోజనాలు, డయాలసిస్ బాధితునికి ఆర్థిక సాయం అందించారు.
Koonavaram: ఘనంగా ఏబీ ఫౌండేషన్ ప్రారంభం నిరుపేదలకు సాయం
కూనవరం: పోలవరం జిల్లా కూనవరం మండలం ఏబి ఫౌండేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ కుంజా అనిల్ ఆధ్వర్యంలో కోతులు గుట్ట ఐటీడీఏ ఫామ్ లో నివాసముంటున్న సుమారు 60 కొండారెడ్డి నిరుపేద కుటుంబాలకు భోజనాలు మరియు చిన్నారులకు బిస్కెట్స్ అందించారు.
భద్రాచలం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డయాలసిస్ వైద్యం చేయించుకుంటున్న చినార్కూర్ గ్రామానికి చెందిన పాయం పాపారావు కి అత్యవసర వైద్య ఖర్చుల నిమిత్తం 3000 రూపాయలు మరియు కుటుంబ సభ్యులకు భోజనాలు పంపిణీ చేయడం జరిగింది.ఈ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి ఏ రోజు ఏ అవసరం వచ్చిన మీ వెంట చిన్న సహాయం చేయడానికి ఏబి ఫౌండేషన్ ఎప్పుడు మీ ముందు ఉంటుందని, గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలు లేకుండా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఏబి ఫౌండేషన్ తమ వెంట ఉంటుందని అన్నారు.
కడుపు నిండిన వారికి కష్టం విలువ తెలియదు ఆకలి వేసిన వాడికి అన్నం విలువ తెలుస్తుంది అన్న నానుడి లాగా మేము చేసే సహాయం చిన్నదైనా మీకు మీ కష్టానికి తోడ్పాటును ఇస్తే చాలు అనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ సంస్థ ప్రారంభించడం జరిగిందని కుంజా.అనిల్ అన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుష్టి జోగారావు మాట్లాడుతూ సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాలు మునుముందు మంచి గుర్తింపు తీసుకురావాలని నేడు ప్రారంభమైన ఈ సంస్థ రానున్న కాలంలో అత్యున్న శిఖరాలను అధిరోహించాలని అన్నారు.
ఈ సంస్థకు మునుముందు మంచి సాకారాలు అంది పెద్ద స్థాయికి ఎదగాలని మీరు చేసే సహాయాలు నిజమైన నిరుపేద ప్రజలకు అందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కూనవరం వైస్ ఎంపీపీ బండారు సాంబశివరావు,సంస్థ వైస్ చైర్మన్ సోడే ముత్తయ్య, అధ్యక్షులు మచ్చ వినయ్ ప్రసాద్, ఉపాధ్యక్షులు కె.కిరణ్ బాబు ,సంస్థ సభ్యులు తోడం వినోద్,భూమిరెడ్డి,తమ్మిరెడ్డి ముక్కారెడ్డి తదితరులు పాల్గొన్నారు.




