West Godavari: ఎర్ర శ్రీనుకు ప్రధాన పార్టీలు, పెద్దల మద్దతు!

West Godavari: పోడూరు మండలం కవిటం గ్రామ సర్పంచ్ అభ్యర్థి కర్రీ శ్రీనివాస్ రెడ్డి (ఎర్ర శ్రీను)కు గ్రామాభివృద్ధి లక్ష్యంగా ప్రధాన పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు.

Amulya Kulkarni
Published on: 28 Nov 2026 12:06 PM IST
West Godavari
X

West Godavari: ఎర్ర శ్రీనుకు ప్రధాన పార్టీలు, పెద్దల మద్దతు!

West Godavari: ప్రముఖ పార్టీల, గ్రామ పెద్దల మద్దతుతో కవిటం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కర్రీ శ్రీనివాస్ రెడ్డి( ఎర్ర శ్రీను) మంచం గుర్తుపై పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాన పార్టీలైన జనసేన, బిజెపి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో, గ్రామ పెద్దలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఎర్ర శ్రీను చేసిన అభివృద్ధి పనులే విజయానికి దోహదం చేస్తాయని, గ్రామ సర్పంచ్ గా ఎర్ర శ్రీను ఎన్నికైతే గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులు జరుగుతాయని గ్రామ పెద్దలు, ప్రధాన పార్టీలు ఏకతాటిపైకి వచ్చి బేసరత్తుగా మద్దతు తెలిపారు.

గ్రామంలో ప్రధాన సమస్యలైనా డంపింగ్ యార్డ్ ఏర్పాటు, కవిటం సెంటర్ లో బస్ షెల్టర్ తో పాటు సులభ కాంప్లెక్స్ నిర్మాణము, రాత్రి ప్రయాణాలలో మహిళలకు ప్రత్యేక భద్రత, అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణము, పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ కవిటం ఆదర్శ గ్రామ పంచాయతీగా తన లక్ష్యమని ఎర్ర శ్రీను తెలుపుతూ జనసేన బిజెపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ పెద్దల సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్ళినప్పుడు మహిళలు యువత పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతూ హారతులతో ఆహ్వానిస్తున్నారన్నారు. రెండవ తేదీ జరగనున్న ఎలక్షన్లలో తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.మంచం గుర్తుపై పోటీ చేస్తున్న గ్రామ సర్పంచ్ అభ్యర్థి కర్రీ శ్రీనివాస్ రెడ్డి విలేకరుల సమావేశంలో

జనసేన గ్రామ అధ్యక్షులు గండేటి సురేష్ కుమార్, బిజెపి మండల సెక్రెటరీ మేడపాటి వెంకట సత్య వరప్రసాద్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొక్క శ్రీను, వైఎస్ఆర్సిపి గ్రామ అధ్యక్షులు పాల వెంకట నరసయ్య, కుక్కల సూరిబాబు,పెంకే రామదాసు మండా విశ్వనాథరెడ్డి, పోతంశెట్టి మునీశ్వర రెడ్డి, పెద్ద సంఖ్యలో గ్రామ పెద్దలు, వివిధ పార్టీల సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Amulya Kulkarni

Amulya Kulkarni