Penumantra: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగ కార్యదర్శిగా కర్రీ గౌరీ సుభాషిణి!
Penumantra: పెనుమంట్ర మాజీ జడ్పీటీసీ కర్రీ గౌరీ సుభాషిణి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగ కార్యదర్శిగా నియమితులయ్యారు.
Penumantra: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగ కార్యదర్శిగా కర్రీ గౌరీ సుభాషిణి!
Penumantra: పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండల జడ్పీటీసీగా మండలానికి కర్తవ్యాలను నిర్వహించిన మాజీ జడ్పిటిసి కర్రీ గౌరీ సుభాషిని.. రాష్ట్ర మహిళా కార్యదర్శిగా పదవి రావడంతో గురువులు మాజీ మంత్రి చెరుకు వాడ శ్రీరంగనాథరాజు వారి గృహంలో కలిసి వారికి దంపతులు కృతజ్ఞతలు తెలియజేశారు. సందర్భంగా ఆయన దంపతులను ఆశీర్వదించారు.
ముదితలు నేర్వలేని విద్య లేదే ముద్దార నేర్పించినన్
అనే ఆర్యోక్తి కి అచ్చమైన నిదర్శనం గా.. పెనుమంట్ర మండల మార్టేరు గ్రామానికి చెందిన పెనుమంట్ర మండల మాజీ జడ్పిటిసి కర్రి గౌరీ సుభాషిణి నిలుస్తారు.ఎం.ఏ. లో ఎకనామిక్స్ ప్రధానంగా (పీజీ )చేసిన గౌరీ సుభాషిణి ఆదర్శ భావాలు సామాజిక స్పృహ కలిగిన భర్త కర్రి వేణుబాబు అడుగు జాడల్లో నడుస్తూ రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు.రాజకీయ రంగంలోనికి 2001 సంవత్సరంలో మార్టేరు- 2 ఎంపీటీసీ గా పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికై ఐదు సంవత్సరాలు చక్కటి సేవలు అందించారు.
తదుపరి 2006లో మార్టేరు గ్రామపంచాయతీ సర్పంచ్ గా 2011 వరకు గ్రామాన్ని ఆదర్శ,గ్రామంగా తీర్చిదిద్దారు. తన పదవీకాలంలో జిల్లా సర్పంచులు చాంబర్ ఉపాధ్యక్షురాలుగా,మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ రీజనల్ చైర్మన్గా సేవలు అందించారు.2008 సంవత్సరం జిల్లా ఉత్తమ సర్పంచ్ గా అదే సంవత్సరం జాతీయ స్థాయిలోప్రతిష్టాత్మకమైన అవార్డుల పరంపరలో, మార్టేరు గ్రామానికి నిర్మల్ గ్రామ పురస్కార అవార్డు, శుభ్రం అవార్డు సాధించి గ్రామానికి మంచి గుర్తింపు తెచ్చారు.
ఇదే క్రమంలో జిల్లా పరిషత్ కు అనుబంధమైన పెనుమంట్ర మండల జడ్పిటిసిగా ఎన్నికై కోట్లాది రూపాయల నిధులు మండలానికి తెచ్చి మండలానికి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. పేద మహిళలకు కుట్లు అల్లికలు నేర్పించడం టైలరింగ్ లో ఉచిత శిక్షణ శిబిరాల నిర్వహణ,పర్యావరణ పరిరక్షణలో మొక్కలు నాటే కార్యక్రమం, ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా ఉద్యమాల నిర్వహణ, డ్వాక్రా సంఘాల అభివృద్ధి కోసం కృషి, ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ ఇలాంటి కార్యక్రమాలను ఎన్నో తన భుజాలపై మోసి విజయవంతం చేశారు.
మార్టేరు సర్పంచిగా గౌరీ సుభాషిణి హయాంలో
పంచాయితీ తరఫున నిర్వహించిన ప్లాస్టిక్ వ్యతిరేక కవితల పోటీల్లో విజేతలకు బహుమతి ప్రధానం చేయడానికి జిల్లా కలెక్టర్ వచ్చి ఆమెను ప్రశంసలతో ముంచత్తడం విశేషం.ఇన్ని ప్రత్యేకతలు ఉన్న గౌరీ సుభాషిణి గతంలో వైయస్సార్సీపి మహిళా విభాగ రాష్ట్ర కార్యదర్శిగా విలువైన సేవలు అందించిన నేపథ్యంలో,తిరిగి అదే పదవిలో ప్రస్తుతం వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధినాయకులు నిర్ణయించి,తాజాగా నియామక ఉత్తర్వులు ఇవ్వడం విశేషం.ఈ పదవి లభించిన గౌరీ సుభాషిణి ని పలువురు గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర ప్రముఖులు అభినందన శుభాకాంక్షలు అందించారు.




