Tanuku: ఐలు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా కామన మునిస్వామి ఎన్నిక!

Tanuku: ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా తణుకు చెందిన న్యాయవాది కామన మునిస్వామి ఎన్నికయ్యారు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 5 Oct 2026 12:40 PM IST
Tanuku
X

Tanuku: ఐలు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా కామన మునిస్వామి ఎన్నిక!

Tanuku: ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా తణుకు పట్టణానికి చెందిన కామన మునిస్వామి ఎన్నికయ్యారు.

ఈనెల 3, 4 తేదీలలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలు నెల్లూరులో నిర్వహించారు. ఈ మహాసభలో నూతన కమిటీ ఎన్నిక జరిగినట్లు ఆయన తెలిపారు. కమిటీలో ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి మునిస్వామిని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా మహాసభ ఎన్నుకున్నట్లుగా వెల్లడించారు. రాష్ట్రంలో న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు సమస్యలపై ఐలు నిర్వహించే పోరాటాల్లో తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

ఈ మహాసభలో పలు తీర్మానాలు న్యాయవాది వృత్తి రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయాలని, న్యాయవాదులకు మెడికల్ ఇన్సూరెన్స్ క్యాష్ లెస్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి, జూనియర్ న్యాయవాదులకు ఇవ్వాల్సిన ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలని,కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం జూనియర్ న్యాయవాదులకు ఉపకార వేతనాన్ని ఐదు వేలు నుంచి పదివేల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)