Poduru: పోడూరు ఎంపీటీసీ-1 సీపీఎం అభ్యర్థిగా కాకర వెంకటేశ్వర్లు

Poduru: పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు ఎంపీటీసీ-1 సీపీఎం అభ్యర్థిగా కాకర వెంకటేశ్వర్లు నామినేషన్ దాఖలు చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడతానని తెలిపారు.

E.ABRAHAM, ACHANTA
Published on: 22 Oct 2026 8:50 PM IST
Poduru
X

Poduru: పోడూరు ఎంపీటీసీ-1 సీపీఎం అభ్యర్థిగా కాకర వెంకటేశ్వర్లు

పోడూరు: పోడూరు మండలంలోని పోడూరు ఎంపీటీసీ 1 లో సీపీఎం పార్టీ తరఫున పోటీ చేస్తున్న పోరాట నాయకుడు కాకర వెంకటేశ్వర్లు గురువారం పోడూరు ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.

ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ సరైన డంపింగ్ యార్డ్లు లేక స్మశాన వాటికలో చెత్త కుప్పలు కుప్పలుగా పేర్కొని అడ్వానంగా ఉన్నాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో సరైన నీటి వసతి కూడా లేదుని ఆవేదన వ్యక్తం చేసారు . పాలకులు మారినా సమస్యలు అలాగే కొనసాగుతున్నాయని గుర్తు చేసారు. సరైన డ్రైనేజీలు లేక పల్లపు రోడ్లు వర్షం నీటికి చెరువులను తలపిస్తున్నాయని వాపోయారు.

ఈ సమస్యలతోపాటు దళిత స్మశాన సమస్య పరిస్కారం కోసం, ప్రభుత్వ కాలనీల్లో రోడ్లు, డ్రైనేజి సమస్యలు కోసం సిపిఎం నిరంతరం పోరాడుతుందని మరోసారి గుర్తుచేశారు.పై తెలిపిన సమస్యలు పరిస్కారం కోసం నిరంతరం పనిచేస్తానని, నన్ను మీరంతా మద్దతు ఇచ్చి సిపిఎం పార్టీ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు పై మీ అమూల్యమైన ఓటుముద్ర వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని మరోసారి ప్రజలందరిని కోరుచున్నానని ఆయన తెలిపారు.

ఈకార్యక్రమంలో సిపిఎం పార్టీ సభ్యులు మూడే మోజేష్, కాటూరి యాకోబు, బొంతు శ్రీను, అభిమానులు కె సుబ్బారావు, ఎస్ పృద్వి, వి చంటి, ఎం రామకృష్ణ, ఎన్ సంషోను, కె నాహుమ్ తదితరులు పాల్గొని మద్దతుగా నిలిచారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA