Yelamanchili: వార్డు అభివృద్ధి కోసం ఎన్నికల బరిలోకి దిగిన జర్నలిస్ట్ వెంకట్!
Yelamanchili: పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ 8వ వార్డు అభివృద్ధి కోసం జర్నలిస్ట్ వెంకట్ ఆదివారం వార్డు మెంబర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
Yelamanchili: వార్డు అభివృద్ధి కోసం ఎన్నికల బరిలోకి దిగిన జర్నలిస్ట్ వెంకట్!
పశ్చిమ గోదావరి జిల్లా: యలమంచిలి మండలం చించినాడ గ్రామంలో పంచాయితీ సర్పంచ్ ల నామినేషన్ పక్రియ మొదలైంది. గ్రామంలో సమస్యలపై అసంతృప్తి తో తాగు నీరు, రోడ్లు, డ్రైనేజిల నిర్మాణం పై అభివృద్ధి సంక్షేమాలపై నిలదీస్తూ చించినాడ 8 వార్డు అభ్యర్దిగా పోటీకి దిగి నామినేషన్ దాఖలు చేసిన జర్నలిస్ట్ వెంకట్. అభివృద్ది పై నిలదీస్తే సమాధానం రాక పోగా బెదిరింపులు లభించడంతో తానే స్వయంగా తన వార్డును అభివృద్ధి చేసి చూపిస్తా అంటూ చించినాడ లో తన 8వ వార్డు అభ్యర్థిగా పోటీలోకి దిగి నామినేషన్ దాఖలు చేసిన మీడియా ప్రతినిధి వెంకట్.




