Bhimavaram: మున్సిపల్ చైర్‌పర్సన్‌గా వేగేశ్న రామ బంగారు రోహిణి పేరు పరిశీలన!

Bhimavaram: భీమవరం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పవన్ కళ్యాణ్ సన్నిహితుడు కనకరాజు సూరి కుమార్తె, ప్రొఫెసర్ వేగేశ్న రామ బంగారు రోహిణి పేరు పరిశీలనలో ఉంది.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM
Published on: 14 Oct 2026 5:18 PM IST
Bhimavaram
X

Bhimavaram: మున్సిపల్ చైర్‌పర్సన్‌గా వేగేశ్న రామ బంగారు రోహిణి పేరు పరిశీలన!

Bhimavaram: రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన భీమవరం పురపాలక సంఘం (మున్సిపాలిటీ) చైర్‌పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు జనసేన పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భీమవరం మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున వేగేశ్న రామ బంగారు రోహిణి పేరును అధిష్టానం ఖరారు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

​ఈ వార్త రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ​రామ బంగారు రోహిణి.. జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ప్రస్తుతం క్షత్రియ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితులు అయిన కనకరాజు సూరి ఏకైక కుమార్తె కావడం విశేషం. పార్టీ కోసం ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా కుటుంబానికి ప్రాధాన్యత దక్కినట్లు తెలుస్తోంది.

కేవలం రాజకీయ నేపథ్యమే కాకుండా, రోహిణి అత్యుత్తమ విద్యా అర్హతలు కలిగి ఉన్నారు. ఈమె ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఖ్యాతిగాంచిన భీమవరం ప్రఖ్యాత విద్యాసంస్థ సాగి రామకృష్ణంరాజు ఇంజనీరింగ్ కళాశాల (SRKR Engineering College)లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విద్యా రంగంలో విశేష అనుభవం ఉన్న వ్యక్తి మున్సిపల్ పీఠం రేసులో నిలవడంపై పట్టణ ప్రజలు, మేధావుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.

​ఇప్పటికే రోహిణికి సంబంధించిన పూర్తి వివరాలు, బయోడేటాను జనసేన పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. విద్యావంతురాలు, రాజకీయ నేపథ్యం ఉన్న యువనేత మున్సిపల్ చైర్‌పర్సన్ బరిలో నిలుస్తుండటంతో భీమవరం రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM