Achanta: ఆచంట జనసేన నాయకులకు పార్లమెంట్ ఎన్నికల కమిటీలో కీలక పదవులు

Achanta: ఆచంట నియోజకవర్గానికి చెందిన షేక్ మహమ్మద్ అలీ, గోవిందరాజు తదితరులను జనసేన పార్లమెంటు నియోజకవర్గ నిర్వాహక సభ్యులుగా నియమించారు.

E.ABRAHAM, ACHANTA
Published on: 12 Oct 2026 8:38 PM IST
Achanta
X

Achanta: ఆచంట జనసేన నాయకులకు పార్లమెంట్ ఎన్నికల కమిటీలో కీలక పదవులు

ఆచంట: జనసేన పార్టీ ఎన్నికల కమిటీలో ఆచంట నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులకు చోటు లభించింది. పార్లమెంటు నియోజకవర్గ నిర్వాహక సభ్యులుగా షేక్ మహమ్మద్ అలీ, గోవిందరాజు, పోల్నాటి మల్లికార్జున్, ముత్యాల సాయి లక్ష్మి, సలాది పెద్దిరాజు నియమితులయ్యారు.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా నియోజకవర్గ సమన్వయకర్తలతో కలిసి ఈ సభ్యులు పనిచేయనున్నారు. కూటమి పార్టీల మధ్య సమన్వయం, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కార్యక్రమాల పర్యవేక్షణ, పార్టీ కార్యక్రమాల సమాచారాన్ని నాయకులు, కార్యకర్తలకు చేరవేయడం వంటి బాధ్యతలను నిర్వర్తించనున్నారు. వీరి నియామకం పట్ల నియోజవర్గ జనసేన కార్యకర్తలు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. చేస్తున్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA