Iragavaram: పొదలాడ రోడ్డు ఆక్రమణను నిలిపివేయాలని రాస్తారోకో

Iragavaram: ఇరగవరం మండలం పొదలాడ రోడ్డు ఆక్రమణపై గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. చెరువుల వ్యాపారులు గోడ కట్టడాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 7 Oct 2026 7:40 PM IST
Iragavaram
X

Iragavaram: పొదలాడ రోడ్డు ఆక్రమణను నిలిపివేయాలని రాస్తారోకో

ఇరగవరం: ఇరగవరం మండలం పొదలాడ గ్రామానికి వెళ్లే రోడ్డు మార్జిన్ ను కొంత మంది రొయ్యల, చేపల చెరువుల వ్యాపారస్తులు ఆక్రమించి గోడ కట్టే ప్రయత్నాన్ని ఆపాలని గ్రామస్తులు బుధవారం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కామన మునిస్వామి మాట్లాడుతూ పొదలాడ గ్రామస్తులు అనేక పోరాటాలు చేసి సిమెంట్ రోడ్డు నిర్మించుకున్నారని తెలిపారు.

ఆ రోడ్డుకు ఇరువైపులా మార్జిన్లో కంకర వెయకపోవడంతో వాహనదారులు తరచూ ప్రమాదాలు గురవుతున్నారని పేర్కొన్నారు. అటువంటి సమయంలో రోడ్డు మార్జిన్ వరకు సమీపంలో ఉన్న రొయ్యల, చేపల వ్యాపారులు దౌర్జన్యంగా రోడ్డు మార్జిన్ను ఆక్రమించుకొని పొలాలకు గోడలు నిర్మిస్తున్నారని ఇది దుర్మార్గమైన చర్యని తెలిపా రు.

ప్రజలు జీవన విధానానికి వెళ్లడానికి ఇదే రోడ్డు గుండా ప్రయాణిస్తారని స్కూలుకు వెళ్లే పిల్లలు స్కూల్ బస్సులు ఆటోలు వృద్ధులు హాస్పటల్ కి వెళ్లాలన్న ఈరోడ్డే తప్ప వేరే రోడ్డు లేదని అటువంటి రోడ్డు కు మార్జిను లేకుండా గోడ నిర్మాణం చేస్తే ప్రజలు వాహనాలు తో వెళ్లడానికి ఇబ్బంది పడతారని ప్రమాదాలు జరుగుతాయని అన్నారు.

వెంటనే అధికారులు సర్వే చేసి రోడ్డు మార్జిన్ ఆక్రమణ ఆపాలని లేనిపక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజల సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తావని హెచ్చరించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శికి గ్రామస్తులు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ జుత్తిగ రామాంజనేయులు దంపన బోయిన కనికేశ్వరరావు గడ్డం లక్ష్మణరావు, పెచ్చేటి స్వామి దంపనబోయిన నాగేంద్ర కేత సత్యనారాయణ గడ్డం గంగరాజు మల్లుల చిరంజీవి దుంపనిబోయిన విజయలక్ష్మి కొప్పిశెట్టి అరుణకుమారి , మల్లుల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)