Iragavaram: స్వచ్ఛ రథం సేవలను సద్వినియోగం చేసుకోవాలి: ఎంపీడీవో
Iragavaram: ఇరగవరం మండలంలో స్వచ్ఛ రథం ద్వారా పొడి చెత్తను సేకరించి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు; ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో శ్రీనివాసు పిలుపు.
Iragavaram: స్వచ్ఛ రథం సేవలను సద్వినియోగం చేసుకోవాలి: ఎంపీడీవో
Iragavaram: పరిశుభ్రమైన గ్రామం – ఆరోగ్యకరమైన సమాజం కోసం స్వచ్ఛ రథం సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ. శ్రీనివాసు సూచించారు.
ఇరగవరం మండలం కత్తవపాడు, పొదలాడ గ్రామాల్లో సోమవారం స్వచ్ఛ రథం పర్యటించి ప్రజల వద్ద నుంచి పొడి చెత్తను సేకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సేకరించిన పొడి చెత్తకు విలువను కల్పిస్తూ, దానికి అనుగుణంగా నిత్యావసర సరుకులను ప్రజలకు అందించడం జరిగిందని తెలిపారు. దీంతో ప్రజలు తమ ఇళ్లలో పేరుకుపోయే పొడి చెత్తను స్వచ్ఛ రథానికి అందజేస్తూ, గ్రామ పరిశుభ్రతకు సహకరిస్తున్నారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ స్వచ్ఛ రథం ద్వారా ఇంటి వద్దకే వచ్చి పొడి చెత్తను సేకరించడం ఎంతో ఉపయోగకరంగా ఉందని, చెత్తను సక్రమంగా నిర్వహించడంతో పాటు దానికి ప్రతిఫలంగా నిత్యావసర సరుకులు అందించడం ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉందని తెలిపారు.




