Iragavaram: ఇరగవరంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
Iragavaram: ఇరగవరంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి మండల ఎన్నికల అధికారి సత్యనారాయణ. పోస్టల్ బ్యాలెట్ గడువు నవంబర్ 6 వరకు పొడిగింపు.
Iragavaram: ఇరగవరంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
ఇరగవరం: ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఇరగవరం మండల ఎన్నికల అధికారి కె వివి సత్యనారాయణ ఎన్నికల సిబ్బందికి సూచించారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు సోమవారం ఇరగవరం మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది కోసం పోస్టల్ బ్యాలెట్ స్వీకరణ ప్రక్రియ ఈ నెల 6 తేదీ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు.
సిబ్బంది నిర్ణీత గడువు లోపు తమ పోస్టల్ బ్యాలెట్‌ను స్వీకరించి, సంబంధిత ప్రక్రియను పూర్తి చేసుకోవాలన్నారు. తొలి రోజు 10 పోస్టల్ బ్యాలెట్ స్వీకరించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ.శ్రీనివాసు, తహశీల్దార్ఎమ్.సుందరరాజు, ఎంఈఓ ఎస్.శ్రీనివాసరావు, ఎంఓటిీ పి.ఎస్.ఎస్.ఎన్.మూర్తి, వి.ఎస్.ఆర్.సి.హెచ్.మూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.




