Maruteru: మారుటేరు వ్యవసాయ పరిశోధనా స్థానాన్ని సందర్శించిన అంతర్జాతీయ శాస్త్రవేత్తలు!
Maruteru: గేట్స్ ఫౌండేషన్ మరియు ఐఆర్‌ఆర్‌ఐకి చెందిన పది మంది అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాన్ని సందర్శించింది.
Maruteru: మారుటేరు వ్యవసాయ పరిశోధనా స్థానాన్ని సందర్శించిన అంతర్జాతీయ శాస్త్రవేత్తలు!
Maruteru: గేట్స్ ఫౌండేషన్ మరియు అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థకు చెందిన పదిమంది శాస్త్రవేత్తల బృందం మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమానికి ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం ఉపకులపతి డా.పి.వి.సత్యనారాయణ అద్యక్షత వహించారు. అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందంలో గేట్స్ ఫౌండేషన్ శాస్త్రవేత్త డా.గారీ అట్లిన్, అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు డా. సంకల్ప్ భోస్లే, డా. వికాస్ కుమార్ సింగ్, డా. పల్లవి సిన్హా, డా. సురేష్ కోడేరు, డా. జాన్ దామిన్ ప్లాటిన్, డా. శలభ్ దీక్షిత్, డా. జవహర్ అలీ, డా. మహేంద్ర అనుమల్ల, డా. నీరజ్ కుమార్ త్యాగి తదితరులు ఉన్నారు.
ముందుగా ఉపకులపతి డా.పి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ మారుటేరులో జరుగుతున్న భాగస్వామ్య పరిశోధనలో సహకరిస్తున్న గేట్స్ ఫౌండేషన్ మరియు ఐ.ఆర్.ఆర్.ఐ వారికి అభినందనలు తెలియజేశారు. జెర్మ్ ప్లాజం మార్పిడి, భాగస్వామ్య పరిశోధనలు, అంతర్జాతీయ స్థాయి సదస్సుల నిర్వహణ, శిక్షణా కార్యక్రమాలు మొదలైన విషయాలలో సహాయ సహకారాలు అందించాలని కోరారు.
మారుటేరు పరిశోధనా స్థానం 1925 వ సంవత్సరంలో ఏర్పాటుచేసిన దగ్గర నుండి ఇప్పటి వరకు 70 రకాలు మరియు 2 సంకరాల రూపకల్పన జరిగిందని, మారుటేరు రకాలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 12.59 లక్షల హెక్టార్ల లోనూ, భారత దేశం మొత్తం మీద 90 లక్షల హెక్టార్లలో సాగుచేస్తున్నారని తెలిపారు. బ్రీడర్ సీడ్ ఇండెంట్లలో మారుటేరు రకాలు ఆంద్ర ప్రదేశ్ లో 77.37%, దేశంమొత్తం మీద 24 % వాటాను కలిగి ఉన్నాయని తెలిపారు.
రైతుల అవసరాల దృష్ట్యా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, మధ్యస్థ కాలపరిమితి, ఆకు ఎండు తెగులును తట్టుకునే సన్నగింజ రకాల రూపకల్పన అత్యవసరమని ఆయన తెలిపారు. అంతేకాక వ్యవసాయ విశ్వ విద్యాలయం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “ఆంగ్రూ ఇన్నోవేటివ్ కిసాన్ నెట్వర్క్” లో 3500 మంది సృజనాత్మక రైతులు భాగస్వామ్యులుగా ఉన్నారని వారి ద్వారా పరిశోధనా ఫలితాలు రాష్ట్రంలోని ప్రతి మండలానికి చేరేవిధంగా కార్యచరణ రూపొందించామని ఆయన బృందానికి తెలిపారు. స్పీడ్ బ్రీడింగ్ వంటి ఆధునిక పరిశోధనల కొరకు కావసిన మౌలిక సదుపాయాల కల్పనకు సహాయ సహకారాలు అందించాలని కోరారు.
డా.గారీ అట్లిన్ మారుటేరులో జరుగుతున్న పరిశోధనలపై హర్షం వ్యక్తం చేసారు. భవిషత్తులో పరిశోధనా స్థానానికి కావలసిన పూర్తిస్థాయి సహాయ అందిచడానికి కృషి చేస్తామని తెలిపారు. బి.పి.టి 5204, స్వర్ణ రకాల లక్షణాలు కలిగి, చీడపీడలను తట్టుకునే సంకరాల రూపకల్పనపై పరిశోధనలు చేస్తున్నట్టుగా తెలిపారు.
తదుపరి జరిగిన అంతర్జాతీయ శాస్త్రవేత్తలు మరియు రైతుల చర్చా ఘోస్టి లో శ్రీ.నెక్కంటి సుబ్బారావు, ఆచంట, శ్రీ మేడికొండ రమేష్, కైకరం వంటి అభ్యుదయ రైతులు మాట్లాడుతూ గోదావరి మండలం లో ఎండాకు తెగులు ప్రధాన సమస్యగా ఉన్నదని దానిని తట్టుకుంటూ, తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ కలిగి , జింక్ , ఇనుము, ప్రోటీన్ వంటి పోషకాలు కలిగిన మధ్యస్థ కాలపరిమితి రకాలను రూపొందాయించాలని కోరారు. తదుపరి జరిగిన
ఈ కార్యక్రమం లో విశ్వ విద్యాలయ పరిశోధనా సంచాలకులు డా.వి.సుమతి, డైరెక్టర్ (సీడ్స్) డా. కె.రాధిక, గోదవరి మండల పరిశోధనా సహా సంచాలకులు డా.సి.హెచ్.శ్రీనివాస్, ప్రధాన శాస్త్రవేత్త (వరి) డా.ఎం.గిరిజారాణి, బాపట్ల, రాగోలు, నెల్లూరు, మచిలీపట్నం వరి పరిశోధనా స్తానల నుండి విచ్చేసిన శాస్త్రవేత్తలు, గోదావరి మండల పరిశోధన మరియు విస్తరణ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.




