Penugonda: వడలి గ్రామ సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి ఉప్పలపాటి మౌనిక గెలుపు!

Penugonda: పెనుగొండ మండలం వడలి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి ఉప్పలపాటి మౌనిక నాగ సుప్రియ 177 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

E.ABRAHAM, ACHANTA
Published on: 27 Nov 2026 8:40 PM IST
Penugonda
X

Penugonda: వడలి గ్రామ సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి ఉప్పలపాటి మౌనిక గెలుపు!

పెనుగొండ: గ్రామపంచాయతీ ఎన్నికల్లో వడలి గ్రామ సర్పంచ్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఉప్పలపాటి మౌనిక నాగ సుప్రియ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 177 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల ముందుకు వెళ్లి తన అభ్యర్థిత్వాన్ని తెలియజేసిన ఆమెకు ఓటర్లు తమ ఓటు ద్వారా మద్దతు పలికారు.

ఓట్ల లెక్కింపు అనంతరం 177 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించినట్లు ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి. ఈ విజయంతో వడలి గ్రామపంచాయతీ సర్పంచ్గా ఉప్పలపాటి మోనిక నాగ సుప్రియ ఎన్నికయ్యారు. ఫలితాలు వెలువడిన వెంటనే ఆమె మద్దతుదారులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి మెజారిటీతో విజయం సాధించడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని పలువురు ఆకాంక్షించారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA