Poduru: ఇంటిపై కూలిన భారీ వృక్షాలు: రోడ్డున పడ్డ తల్లీకొడుకులు
Poduru: పోడూరు మండలం జగన్నాథపురం జెడ్ వంతెన వద్ద ఆర్నబ్ తుఫాన్ ధాటికి భారీ వృక్షాలు ఇంటిపై కూలి నివాసం, దుకాణం ధ్వంసమవడంతో తల్లీకొడుకులు నిరాశ్రయులయ్యారు.
Poduru: ఇంటిపై కూలిన భారీ వృక్షాలు: రోడ్డున పడ్డ తల్లీకొడుకులు
పోడూరు: ఆర్నబ్ తుఫాన్ బీభత్సానికి పోడూరు మండలం జగన్నాథపురం మెయిన్ రోడ్, జెడ్ వంతెన వద్ద ఒక కుటుంబం రోడ్డున పడింది. గుడాల శ్రావణావతి భర్త కోవిడ్ లో చనిపోవడంతో కుమారుడితో ఆర్ అండ్ బిస్థలములో ఇల్లు నిర్మించుకొని జీవిస్తుంది.
గత వందేళ్లుగా నిలిచి ఉన్న పురాతన రావి చెట్టు, నిద్ర గన్నేరు చెట్టు, రెండు కొబ్బరి చెట్లు ఒకేసారి విరిగి, పక్కనే ఉన్న శ్రావణావతి చెందిన ఇళ్లపై కూలాయి. ఈ ఘటనలో ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈదురు గాలులు బలంగా ఇస్తున్నందున తల్లి కుమారుడు మూర్తి. తల దాస్కోవడానికి వేరే చోటికి వెళ్లారు. ఉదయం చూసేసరికి చెట్లు పడిపోయి.
ఇంటిలో షాపులో ఉన్నటువంటిసామానులన్నీ సర్వనాశనం అయిపోయి నిరాశ్రయులయ్యారు. తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక దిక్కుతోచని స్థితిలో రోడ్డుపై నిలబడిపోయారు.ఇప్పుడు ఏమీ మిగల్లేదు" - అంటూ ఆ తల్లి కన్నీటి పర్యంతమవుతోంది.
సంఘటనా స్థలంలో ఇప్పటికీ భారీ చెట్లు అడ్డంగా పడి ఉన్నాయి. కరెంట్ తీగలు తెగిపోయాయి. అధికారులు వెంటనేస్పందించిని రాశ్రయులైన తల్లీకొడుకులకు తక్షణ సహాయంగా అందించాలిఇళ్ల నష్టానికి ప్రభుత్వం నుండి పరిహారం ఇప్పించాలిఅనిఅధికారులను వేడుకుంటున్నారు.




