Palakollu: మురసు తుఫాన్ బీభత్సం.. భారీ వర్షాలతో జలమయమైన రోడ్లు!
Palakollu: ఆర్నాబ్ తుఫాన్ ప్రభావం నుంచి కోలుకోకముందే పాలకొల్లులో మురసు తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలకు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి.
Palakollu: మురసు తుఫాన్ బీభత్సం.. భారీ వర్షాలతో జలమయమైన రోడ్లు!
Palakollu: అర్నబ్ తుఫాన్ నుంచి ఇంకా తేరుకోక ముందే మురసు తుఫాన్ పాలకొల్లుపై ప్రభావం చూపుతోంది. గత నాలుగు రోజుల క్రితం వచ్చిన ఆర్నాబ్ తుఫాన్ పాలకొల్లును పరిసర ప్రాంతాలను అతలాకుతలం చేసింది. ఎన్నో ఏళ్ళ నాటి భారీ వృక్షాలు నేల కోరిగాయి.
ఏంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అనేక చిరు వ్యాపారాలు దెబ్బ తిన్నాయి. ఆ భయానక వాతవరణం నుంచి తేరుకొనే లోపు మరో తుఫాన్ రావడంతో పాలకొల్లు మరియు పరిసర ప్రాంత ప్రజలు భయపడిపోతున్నారు. మురసు తుఫాన్ కారణంగా పాలకొల్లులో భారీ వర్షం కురుస్తుంది.
పాలకొల్లు ప్రధాన రహదారులు అన్ని నీటితో జలమయం అయ్యాయి. తుఫాన్ కారణంగా మళ్లీ ప్రజలు ఇంకా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు మాత్రం విశ్రాంతి అనేది లేకుండా సహాయక చర్యలు చేస్తూనే ఉన్నారు.




