West Godavari: జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా గురజాడ జయంతి!
West Godavari: గొల్లలకోడేరు జిల్లా పోలీసు కార్యాలయంలో గురజాడ అప్పారావు జయంతి వేడుకలు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి.
West Godavari: జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా గురజాడ జయంతి!
West Godavari: తెలుగు సాహితీ దిగ్గజం, మహాకవి, సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు గారి జయంతి వేడుకలను సోమవారం గొల్లలకోడేరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి, ఐపీఎస్ గారు గురజాడ అప్పారావు గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ గురజాడ అప్పారావు గారు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు విశేషంగా కృషి చేశారని, ప్రజలకు సులభంగా అర్థమయ్యే వ్యావహారిక భాషలో రచనలు చేస్తూ తెలుగు సాహిత్యానికి అమూల్యమైన సేవలందించారని పేర్కొన్నారు. ‘కన్యాశుల్కం’, ‘ముత్యాల సరాలు’ వంటి గొప్ప రచనల ద్వారా సమాజంలోని మూఢాచారాలు మరియు దురాచారాలను ఎండగట్టి, సామాజిక చైతన్యానికి బాటలు వేసిన గురజాడ ఆశయాలు నేటి తరాలకు ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
“దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్” అనే ఆయన సందేశం సమాజం పట్ల ప్రతి ఒక్కరి బాధ్యతను గుర్తుచేస్తుందని తెలిపారు. గురజాడ వారి సాహిత్య కృషి, సామాజిక స్పృహ మరియు మానవతా దృక్పథాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీ డి. విశ్వనాథ్ గారు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ కె.వి.వి.ఎన్ సత్యనారాయణ గారు, మహిళా ఆర్మ్డ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ (అడ్మిన్) శ్రీమతి ఇ.ఇందుమతి గారు మరియు ఇతర పోలీసు కార్యాలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొని మహాకవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.




