Tanuku: తణుకు హౌసింగ్ బోర్డు కాలనీలో ఘనంగా గణపతి నిమజ్జనం!

Tanuku: పశ్చిమగోదావరి జిల్లా తణుకు హౌసింగ్ బోర్డు కాలనీలో ఘనంగా గణపతి నిమజ్జనం.. సాంస్కృతిక ప్రదర్శనలు, తీన్మార్ డప్పులతో యువత సందడి.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 20 Sept 2026 2:06 PM IST
Tanuku
X

Tanuku: తణుకు హౌసింగ్ బోర్డు కాలనీలో ఘనంగా గణపతి నిమజ్జనం!

Tanuku: తణుకు హౌసింగ్ బోర్డు కాలనీలో రెబల్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తీన్మార్ డప్పుల మోత, జై గణేశ్ నినాదాలతో నిర్వహించిన ఊరేగింపులో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు.

గణపతిని వాహనంపై ఏర్పాటు చేసి పట్టణ వీధుల్లో ఊరేగించారు. బుట్ట బొమ్మలు,శక్తి వేషధారణలు, యువతుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు, ఆంజనేయస్వామి వేషధారణలు ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రెబల్స్ యూత్ సభ్యులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ, గణపతి నామస్మరణతో ముందుకు సాగారు. తీన్మార్ డప్పుల మోతతో హౌసింగ్ బోర్డు కాలనీ వీధుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు, యువత, రెబల్స్ యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)