Tanuku: రూట్స్ స్కూల్‌లో ఘనంగా దసరా, బతుకమ్మ వేడుకలు
Tanuku: తణుకు రూట్స్ స్కూల్‌లో దసరా నవరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. దైవ అవతారాల వేషధారణలు, బతుకమ్మ, దాండియా నృత్యాలతో చిన్నారులు సందడి చేశారు.
Tanuku: రూట్స్ స్కూల్‌లో ఘనంగా దసరా, బతుకమ్మ వేడుకలు
Tanuku: తణుకు పట్టణం రూట్స్ ప్రైమరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో దసరా పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దసరా నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థులు సంప్రదాయ వేషధారణలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. పది అవతారాల వేషధారణలో విద్యార్థినులు, బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల వేషధారణలో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన అమ్మవారి సన్నిధిలో వివిధ రకాల పూలతో బతుకమ్మను అలంకరించి వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడంతో పాటు దాండియా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. చిన్నారుల సంప్రదాయ వేషధారణలు, సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా విద్యార్థులకు దసరా పండుగ విశిష్టత, నవరాత్రుల ప్రాముఖ్యత, హిందూ సంప్రదాయాలు, సంస్కృతి గురించి ఉపాధ్యాయులు వివరించారు. పండుగల ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పింకీ, నర్మద, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.




