Narsapuram: నరసాపురంలో రూ.6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు పట్టివేత!

Narsapuram: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం రుస్తుంబాధ చెక్‌పోస్టు వద్ద పోలీసుల తనిఖీల్లో 3.6 కిలోల బంగారు ఆభరణాలు పట్టుబడ్డాయి.

POTHUMUDI MUTYALU, NARASAPURAM
Published on: 26 Oct 2026 12:32 PM IST
Narsapuram
X

Narsapuram: నరసాపురంలో రూ.6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు పట్టివేత!

Narsapuram: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం రుస్తుంబాధ చెక్‌పోస్టు వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా బంగారు ఆభరణాలు పట్టుబడ్డాయి. విజయవాడ నుంచి నరసాపురం వస్తున్న ఏపీ 39 యూవీ 7424 నంబరు గల స్విఫ్ట్ డిజైర్ కారును సోమవారం తనిఖీ చేయగా, అందులో సుమారు 3.6 కిలోల బంగారు ఆభరణాలను గుర్తించారు.

వీటి విలువ దాదాపు రూ.6 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను తరలిస్తుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఆభరణాలకు సంబంధించిన బిల్లులు, వాటిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎక్కడికి తరలిస్తున్నారు, రవాణాకు సంబంధించిన అనుమతి పత్రాలు ఉన్నాయా? అనే అంశాలపై సీఐ ఆకులు రఘు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణ అనంతరం ఆభరణాల తరలింపునకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

POTHUMUDI MUTYALU, NARASAPURAM

POTHUMUDI MUTYALU, NARASAPURAM