Palakollu: పాలకొల్లు డిగ్రీ కళాశాలలో ఆర్థిక అక్షరాస్యతపై సదస్సు

Palakollu: పాలకొల్లు ఏఎస్‌ఎన్ఎం డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యత, పొదుపు, సెక్యూరిటీస్ మార్కెట్ పెట్టుబడులపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

S VENKAT, PALAKOLLU
Published on: 19 Sept 2026 7:11 PM IST
Palakollu
X

Palakollu: పాలకొల్లు డిగ్రీ కళాశాలలో ఆర్థిక అక్షరాస్యతపై సదస్సు

పాలకొల్లు: స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి స్వయం ప్రతిపత్తి ప్రభుత్వ కళాశాలలో అర్థశాస్త్రం మరియు వాణిజ్య శాస్త్ర విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో “ఆర్థిక అక్షరాస్యత” పై అవగాహన కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె రత్న మాణిక్యం అధ్యక్షతన నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి తెనాలి భవాని శంకర్, సెక్యూరిటీస్ మార్కెటింగ్ ట్రైనర్, సెబీ , విజయవాడ, రిసోర్స్ పర్సన్‌గా విచ్చేసి విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యత, పొదుపు, పెట్టుబడులు, ఆర్థిక ప్రణాళిక, సెక్యూరిటీస్ మార్కెట్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె రత్న మాణిక్యం మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి ప్రాథమిక ఆర్థిక అంశాలపై అవగాహన కలిగి ఉండటం నేటి సమాజంలో ఎంతో అవసరమని అన్నారు. సంపాదనతో పాటు పొదుపు, సరైన పెట్టుబడి, ఆర్థిక ప్రణాళిక వంటి అంశాలపై విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఆర్థిక నిర్ణయాలను జాగ్రత్తగా, సమాచారంతో తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఆర్థికంగా స్థిరమైన జీవితాన్ని నిర్మించుకోవచ్చని పేర్కొన్నారు.

రిసోర్స్ పర్సన్ తెనాలి భవానీ శంకర్ మాట్లాడుతూ, విద్యార్థులు ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొదుపు అలవాటును చిన్న వయస్సు నుంచే పెంపొందించుకోవాలని, పెట్టుబడులు పెట్టే ముందు సంబంధిత అంశాలపై పూర్తి అవగాహన పొందాలని తెలిపారు. సెక్యూరిటీస్ మార్కెట్‌లో పెట్టుబడులు, రిస్క్–రిటర్న్, మోసపూరిత ఆర్థిక పథకాలను గుర్తించడం, పెట్టుబడిదారుల జాగ్రత్తలు తదితర అంశాలను వివరించారు. విద్యార్థులు తమ భవిష్యత్తు ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీ టి కృష్ణ, ఐ క్యు ఎ సి కోఆర్డినేటర్ డా బూసి వెంకటస్వామి, అకడమిక్ కోఆర్డినేటర్ జి సుమలత, జెకెసి కోఆర్డినేటర్ కె శామ్యూల్, అర్థశాస్త్రం మరియు వాణిజ్య శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ వి శ్రీరామ్ నరేంద్ర,డాక్టర్ వి డి వి విజయలక్ష్మి, కె స్వర్ణలత, బి ఆశాజ్యోతి, డి మన్మధరావు, ఐ భాగ్యలక్ష్మి , ఇతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఆర్థిక విషయాలపై అవగాహన, పొదుపు పట్ల ఆసక్తి, పెట్టుబడులపై ప్రాథమిక జ్ఞానం పెంపొందించబడింది.

S VENKAT, PALAKOLLU

S VENKAT, PALAKOLLU