Devarapalli: రహదారిపై పడిన భారీ చెట్టు తొలగింపు - రాకపోకలు పునరుద్ధరణ!

Devarapalli: దేవరపల్లి అల్లిపురం జంక్షన్ వద్ద రహదారిపై కూలిన భారీ చెట్టు. ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలో జేసీబీతో తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేసిన పోలీసులు.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 24 Sept 2026 12:23 PM IST
Devarapalli
X

Devarapalli: రహదారిపై పడిన భారీ చెట్టు తొలగింపు - రాకపోకలు పునరుద్ధరణ!

Devarapalli: అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గ పరిధిలోని దేవరాపల్లి మండలం దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్లిపురం జంక్షన్ వద్ద ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రధాన రహదారిపై ఒక భారీ చెట్టు నేలకూలింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

​సమాచారం అందిన వెంటనే దేవరపల్లి ఎస్సై వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీ సహాయంతో యుద్ధప్రాతిపదికన చెట్టును తొలగించి రోడ్డును క్లియర్ చేశారు. ప్రస్తుతం సదరు మార్గంలో ట్రాఫిక్ సమస్య పూర్తిగా పరిష్కారమై, వాహనాల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి.

​ప్రస్తుత వర్షాల దృష్ట్యా వాహనదారులు, ప్రజలు అప్రమత్తంగా ప్రయాణించాలని, రహదారులపై ఎలాంటి ప్రమాదాలు లేదా అంతరాయాలు ఏర్పడినా వెంటనే పోలీసు శాఖకు సమాచారం అందించాలని కోరడమైనది.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM