Etapaka: ఎటపాకలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు బీమా కార్డుల పంపిణీ
Etapaka: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలతో ఎటపాక మండలంలో పార్టీ కార్యకర్తలకు గుర్తింపు కార్డులు, ప్రమాద బీమా పత్రాలను పంపిణీ చేశారు.
Etapaka: ఎటపాకలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు బీమా కార్డుల పంపిణీ
ఎటపాక: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు మరియు ఉచిత ప్రమాద భీమా కార్డులను మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి సూచనల మేరకు ఎటపాక మండల కమిటీ ఆధ్వర్యంలో నేడు ఘనంగా పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ పార్టీకి అసలైన సైనికులు కార్యకర్తలేనని,వారి కష్టసుఖాల్లో పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అధినేత జగనన్న ప్రవేశపెట్టిన ఈ ఇన్సూరెన్స్ విధానం వల్ల ప్రతి కార్యకర్త కుటుంబానికి కొండంత ధైర్యం చేకూరుతుందని తెలిపారు.
మండల కమిటీ నాయకులు మరియు ముఖ్య నేతలు స్వయంగా మండలం లోని అన్ని పంచాయతీలకు తమ చేతుల మీదుగా పార్టీ సభ్యులకు,కార్యకర్తలకు ఈ ఇన్సూరెన్స్ ఐడీ కార్డులను అందజేశారు. నాయకుల చేతుల మీదుగా కార్డులు అందుకున్న కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తూ పార్టీ బలోపేతానికి మరింత ఉత్సాహంతో పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎటపాక మండల అధ్యక్షులు ఆకుల వెంకటరామారావు (పెద్దోడు),రాష్ట్ర కార్యదర్శి కురినాల వెంకటేశ్వర్లు (బుజ్జి),ఎటపాక మండల సోషల్ మీడియా భాగం కమిటీ అధ్యక్షులు గొంగడి వెంకటరామిరెడ్డి,మండల మహిళా అధ్యక్షురాలు గుడిమల్ల నాగలక్ష్మి, యువజన విభాగం అధ్యక్షులు తోట శశి కుమార్,చల్లమని, పెనుబల్లి కోటేష్,పులుసు వంశీ, కాటo స్వరూప, సుజాత, వినోద్, నరేష్ భద్రయ్య, పాపారావు, సోడే ప్రసాద్, ఎడ్ల ప్రసాద్ ,పండు బాబు, నూతి రమేష్,బోయిన శీను, బాబురావు పాల్గొన్నారు.




