Palakollu: పాలకొల్లు నియోజకవర్గంలో ప్రమాదకరంగా ఏటిగట్టు పాత బ్రిడ్జ్!

Palakollu: యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామంలో దెబ్బతిన్న ఏటిగట్టు బ్రిడ్జి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్న రైతులు, బాటసారులు.

S VENKAT, PALAKOLLU
Published on: 21 Sept 2026 1:37 PM IST
Palakollu
X

Palakollu: పాలకొల్లు నియోజకవర్గంలో ప్రమాదకరంగా ఏటిగట్టు పాత బ్రిడ్జ్!

Palakollu: పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామంలో ఏటుగట్టును ఆనుకొని ఉన్న బ్రిడ్జి ప్రమాదకరంగా ప్రమాదకరంగా మారింది. దొడ్డిపట్ల నుండి కనకాయలంక పెర్రి దాటాలంటే ఈ బ్రిడ్జి మీదనుండే వెళ్ళాలి, భవన నిర్మాణదారులుకు ఇసుక తెచ్చుకోవాలన్నా, రైతులు లంకల్లో ఉన్న పొలాలకు వెళ్ళాలన్న ఈ బ్రిడ్జి మీదుగానే ప్రయాణం చేయాల్సిఉంది.

గత 36 సంవత్ససరాల క్రితం నిర్మించిన ఈ బ్రిడ్జి క్రింద ఐరన్ గిడర్స్ తుప్పుపట్టటం వల్ల సిమెంట్ కాంక్రీటు పగుళ్ళు వచ్చి ప్రమాదకరంగా మారింది. వేరే దారి లేక అటువైపు వెళ్లే బాటసారులు, రైతులు, వాహనదారులు, లంక గ్రామాలకు వెళ్లే ప్రజలు ప్రాణాలు చేతపట్టి భయంతో ఈ బ్రిడ్జి మీద ప్రయాణం సాగిస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు, రైతులు కోరుచున్నారు.

S VENKAT, PALAKOLLU

S VENKAT, PALAKOLLU