Marteru: కనకదుర్గమ్మ ఆలయంలో వైభవంగా దసరా శరన్నవరాత్రి వేడుకలు
Marteru: పశ్చిమగోదావరి జిల్లా మార్టేరు కనకదుర్గమ్మ ఆలయం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలతో భక్తిశోభ సంతరించుకుంది. చైర్మన్ తేతలి రాజారెడ్డి అలంకరణను పర్యవేక్షించారు.
Marteru: కనకదుర్గమ్మ ఆలయంలో వైభవంగా దసరా శరన్నవరాత్రి వేడుకలు
మార్టేరు: పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా దసరా మహోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మార్టేరు గ్రామంలోని శ్రీ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సోమవారం అమ్మవారి ఆలయాన్ని దేవస్థానం చైర్మన్ తేతలి రాజారెడ్డి
పూల మాలలతో ప్రత్యేకమైన ఆకర్షణతో అమ్మవారి గుడిని దగ్గరుండి అలంకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు అధికారులకు నాయకులకు ఈ విజయ సందర్భంగా అమ్మవారి కృప కటాక్షములు అందరిపై ఉండాలని . నవరాత్రి వేడుకలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.




