Rampachodavaram: రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా ఐఏఎస్ పృధ్వీరాజ్ బాధ్యతల స్వీకరణ

Rampachodavaram: రంపచోడవరం నూతన సబ్ కలెక్టర్‌గా 2024 బ్యాచ్ ఐఏఎస్ అధికారి డి. పృధ్వీరాజ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. గిరిజనాభివృద్ధే లక్ష్యమని ఆయన ప్రకటించారు.

Prasanna, Rampachodavaram
Published on: 1 Oct 2026 6:19 PM IST
Rampachodavaram
X

Rampachodavaram: రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా ఐఏఎస్ పృధ్వీరాజ్ బాధ్యతల స్వీకరణ

పోలవరం జిల్లా: రంపచోడవరం నూతన సబ్ కలెక్టర్‌గా 2024 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి డి. పృద్వీరాజ్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. UPSC–2023లో 493వ ర్యాంకు సాధించిన ఆయన గతంలో శ్రీకాకుళం జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా శిక్షణ పొందారు.

గిరిజన ప్రాంతాల అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ రెవెన్యూ సమస్యలను నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.

ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, కార్యాలయ సిబ్బంది నూతన సబ్ కలెక్టర్‌కు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.

రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ షేక్ ఫయాజ్ బాషా (జిలాని), డిప్యూటీ తహశీల్దార్, అడ్హాక్ కమిటీ సభ్యులు శ్రీ ఎం. లక్ష్మణరావు, మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్, శ్రీ పాల్ అలెగ్జాండర్ జూనియర్ సహాయకులు మరియు రెవిన్యూ ఉద్యోగులు శ్రీ సి.హెచ్. బాలాజీ, తహశీల్దార్, రంపచోడవరం; శ్రీ రవీంద్ర, డిప్యూటీ తహశీల్దార్; శ్రీమతి ఎల్. సునీత కుమారి, ఎలక్షన్ డిప్యూటీ తహశీల్దార్; శ్రీమతి సి.హెచ్. నిర్మల కుమారి, మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్; శ్రీ కె. వెంకటేశ్వర్లు, సీనియర్ సహాయకులు; శ్రీమతి డి. ఇందిరా భాయి, సీనియర్ సహాయకులు; శ్రీ సి.హెచ్. చంటి, జూనియర్ సహాయకులు తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram