Penumantra: తుఫాను వేళ వరి పంట రక్షణకు శాస్త్రవేత్తల సూచనలు

Penumantra: గోదావరి డెల్టా, ఉత్తరకోస్తా జిల్లాల్లో తుఫాను వర్షాల వేళ వరి పంటలో మొలకలు రాకుండా, తెగుళ్లు సోకకుండా తీసుకోవాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలు.

E.ABRAHAM, ACHANTA
Published on: 30 Oct 2026 8:18 PM IST
Penumantra
X

Penumantra: తుఫాను వేళ వరి పంట రక్షణకు శాస్త్రవేత్తల సూచనలు

Penumantra: గోదావరి డెల్టా, ఉత్తరకొస్తా జిల్లాలలో తుఫాన్ వల్ల ఈదురు గాలులతో కూడిన అధిక వర్షాల హెచ్చరికల నేపథ్యంలో వరి పంటకు జరిగే నష్టతీవ్రతను తగ్గించుకోవడానికి ఈ దిగువున తెలిపిన చర్యలు తీసుకోవాలి. ఈ జిల్లాల్లో వరి పంట పూత దశ, పాలు పోసుకునే దశ మరియు కోత దశలలో ఉన్నది. వీలైనంత వరకు పొలం నుండి వర్షపు నీటిని ఎప్పటికప్పుడు అవకాశాన్ని బట్టి బయటకు పంపాలి.

పూత దశకు ముందు ఉన్న చేలలో ( ఆర్. జి. యల్ 2537, బి పి టి 5204 )

వర్షం తగిన తర్వాత ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటె ఎండాకు తెగులు , మానిపండు తెగులు, మాగుడుతెగులు ,ఆకుముడత , దోమపోటు పెరిగే అవకాశం ఉంది.పిగులు పొట్టనుండి ఈనిక దశలో చేను పడిపోయి ఒక రోజు మీట మునిగినప్పటికీ 75 శాతం కన్నా ఎక్కువ తాలు గింజలు ఏర్పడి పంట నష్టం జరుగుతుంది.

పూత దశ (ఎం టి యు 1061, ఎం టి యు 1064, ఎం టి యు 1318, ఎం టి యు 1262, ఎం టి యు 1224) నిలబడి ఉన్న చేలలో తాలు గింజలు ఏర్పడే అవకాశం ఉంది .ధాన్యం రంగు మారకుండా మరియు మానిపండు తెగులు, మాగుడు తెగులు వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

పాలు పోసుకునే దశలో ఉన్న రకాలు (స్వర్ణ, సంపద స్వర్ణ,) వర్షాలు వలన చేను పడిపోతే పొలంలో నీటిని అంతర్గత కాలువల ద్వారా తొలగించాలి.

నిలబడి ఉన్న మరియు పడిపోయిన చేలలో గింజలు రంగు మారటం, మాగుడు తెగులు మరియు మానిపండు తెగులు వ్యాప్తి నివారించడానికి ఎకరాకు 200 మి.లీ. ప్రోపికోనాజోల్ పిచికారీ చేయాలి.

గింజ గట్టిపడే దశలో ఉన్న పంట అధిక వర్షాలకు గురి అయితే నిరంతర వర్షాల వల్ల గింజలోనిద్రావస్థ తొలిగి నిలబడి ఉన్న మరియు పడిపోయిన చేలలో మొలక వచ్చే అవకాశం ఉన్నది.

* కోత దశలో నిలిచిన లేదా పడిపోయిన పంటలో కంకిలో మొలకలు కనపడితే, నీరు బయటకు తీసివేసిన తర్వాత , 5% ఉప్పు ద్రావణం (50 గ్రాములు కల్లు ఉప్పు / లీటరు నీటికి)కలిపి పిచికారీ చేయాలి. ఇది మొలకెత్తడాన్ని మరియు రంగు మారడాన్ని తగ్గిస్తుంది.కల్లాల మీద ధాన్యం ఉన్నప్పుడు:

ఇప్పటికే కోతకోసి కుప్పల మీద ఉన్న ధాన్యాన్ని బరకాలు కప్పుకొని రక్షించుకోవాలి.

నూర్చిన ధాన్యం రెండు మూడు రోజులు ఎండబెట్టడానికి వీలుకాకపోతే కుప్పలలో గింజ మొలకెత్త కుండా మరియు రంగు మారకుండా ఒక క్వింటాలు ధాన్యానికి ఒక కిలో ఉప్పు మరియు 20 కిలోల పొడి ఊక కలపాలి.పూత దశకు ముందు నుండి పూత దశలో తెగుళ్ల నివారణ రైతులు చేను యొక్క పరిస్థితిని బట్టి పురుగు మరియు తెగుళ్ల ఉథృతిని బట్టి సరి అయిన సస్య రక్షణ చేపట్టుకోవాలి .

బ్యాక్టీరియా ఎండాకు తెగులుకనిపిస్తే ప్లాంటోమైసిన్ 1 మి.లీ/లీటరు + కొసైడ్ ( కాపర్ హైడ్రాక్సయిడ్) 2గ్రా/లీటరు నీటికి కలిపిపిచికారీ చేయాలి. నీరు తగ్గిన తరువాత హెక్సాకోనాజోల్ 400 మి.లీ/ఎకరాకులేదాప్రోపికోనాజోల్ 200 మి.లీ/ఎకరాకుపిచికారీ చేయడం ద్వారా మాగుడు తెగులు వ్యాప్తి తగ్గుతుంది.

మానిపండు తెగులు వ్యాప్తి నివారించడానికి ఎకరాకు 200 మి.లీ. ప్రోపికోనాజోల్ పిచికారీ చేయాలి.ఆకుముడత పురుగు నివారణకు ఎకరాకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 400గ్రా. లేదా క్లోరాన్ట్ర్రిప్రోల్ 60 మి.లీ 200 లీటరు నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి

దోమపోటు, మాగుడు తెగులు మరియు మానిపండు నివారణకు ఎకరానికి`ప్రోపికోనజోల్ 200 మిల్లి +పైమెట్రోజాన్ 120 గ్రా లేదా ప్రోపికోనజోల్ 200 మిల్లి+96 మిల్లీ ట్రైఫ్లుమెజోపైరం 10 ఎస్ సి పిచికారీ చేసుకోవాలి .

* తక్కువ సమయంలో, ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీకి అందుబాటులో ఉన్న డ్రోన్ లను ఉపయోగించుకోవాలి.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA