Poduru: ఆర్నబ్ తుఫాన్‌తో 82% వరి నీటమునక: పోడూరులో కన్నీళ్లు
Poduru: ఆర్నబ్ తుఫాన్ ధాటికి పశ్చిమగోదావరి జిల్లా పోడూరులో 82% వరి పంట నీటమునిగింది; ప్రభుత్వం హెక్టారుకు రూ.25 వేల పరిహారాన్ని ప్రకటించింది.
Poduru: ఆర్నబ్ తుఫాన్‌తో 82% వరి నీటమునక: పోడూరులో కన్నీళ్లు
పోడూరు: పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలంలోని ఆరుగాలం శ్రమించి, అప్పులు చేసి పండించుకున్న పంట.. ఒక్క ఆర్నబ్ తుఫాన్ దెబ్బతో నేలమట్టమైంది. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నీట మునిగి, రైతు కళ్ల ముందే కుళ్లిపోతోంది. పశ్చిమ గోదావరి జిల్లాపోడూరు మండలాల్లో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.
పశ్చిమ గోదావరి జిల్లాలో 82 శాతం వరి విస్తీర్ణం నీట మునిగిపోయిందని, రైతు ఆవేదన.ఎకరాకు 30 వేలు పెట్టుబడి 20 రోజులు దాటితే పంట చేతికి వస్తాది. అనుకున్నసమయంలో ఆర్నబ్ తుఫాన్ వచ్చి అంతా నాశనం చేసింది. వరి రైతులు, అరటి తోట రైతులు, బీరపాదులు రైతులు పైరు పంటలన్నీ సర్వ నాశనం అయిపోయాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు రైతులను ప్రభుత్వంఆదుకోకపోతే ఆత్మహత్యేశరణ్యం" పండితవిల్లూరు రైతు ఆవేదన..
తుఫాన్ పై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో సమీక్షించి, పంట నష్టంపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులనుఆదేశించారు. పరిహారం ప్రకటన వరి పంట నష్టానికి హెక్టారుకు రూ. 25 వేలు, మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, దెబ్బతిన్న ఇళ్లకు రూ.10 వేలు పరిహారం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
రైతులు పంట నష్టాన్ని రైతులే స్వయంగా కర్షక్ పోర్టల్ లో నమోదు చేసుకోవచ్చు. ఆధార్ నంబర్, సర్వే నంబర్, నష్టపోయిన విస్తీర్ణం, పంట ఫోటో అప్ లోడ్ చేసి ఓటీపీ తో నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ తెలిపారు.




