Achanta: పెరిగిన నిత్యవసర ధరలపై ఆచంటలో నోట్లో గడ్డితో సీపీఎం వినూత్న నిరసన!

Achanta: ఆచంటలో పెరిగిన నిత్యవసరాల ధరలపై సీపీఎం నిరసన. నోట్లో గడ్డి పెట్టుకుని, గ్యాస్ బండ, బియ్యం బస్తాతో వినూత్నంగా కేత గోపాలన్ ఆధ్వర్యంలో ఆందోళన.

E.ABRAHAM, ACHANTA
Published on: 13 Oct 2026 8:25 PM IST
Achanta
X

Achanta: పెరిగిన నిత్యవసర ధరలపై ఆచంటలో నోట్లో గడ్డితో సీపీఎం వినూత్న నిరసన!

ఆచంట: పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలతో ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారిందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేతగోపాలన్ అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో పెరిగిన ధరలకు నిరసనగా గ్యాస్ బండ, ఉల్లిపాయలు, బియ్యం బస్తా, పంచదార తో పాటు నోట్లో గడ్డి పెట్టుకుని వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బియ్యo కూరగాయలు, పెట్రోలు, డీజిల్, గ్యాస్, ఇలా అన్నింట ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్య మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా అవస్థలు పడుతున్నారని వాపోయారు.. తక్షణమే అధికారులు స్పందించి ధరలు నియంత్రణించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పి మోహన్ రావు, తలుపురి బుల్లబ్బాయి, కుసుమే జయరాజు, సిర్రా నరసింహమూర్తి, మచ్చ సుబ్బారావు, గుత్తుల రంగారావు, ఇంజేటి వీరయ్య, ఉన్నమట్ల పద్మారావు, విజయ్ కుమార్, దాసిరెడ్డి కోటేశ్వరరావు, బొక్క సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA