Tanuku: జంతర్ మంతర్ ధర్నా అడ్డుకోవడాన్ని ఖండిస్తూ తణుకు పరిధిలో సీపీఎం నిరసన!

Tanuku: న్యూఢిల్లీ జంతర్ మంతర్ ధర్నా అడ్డుకోవడాన్ని ఖండిస్తూ తణుకు నియోజకవర్గంలో సీపీఎం నిరసన. ఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు కన్వీనర్ మునిస్వామి డిమాండ్.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 11 Oct 2026 6:30 PM IST
Tanuku
X

Tanuku: జంతర్ మంతర్ ధర్నా అడ్డుకోవడాన్ని ఖండిస్తూ తణుకు పరిధిలో సీపీఎం నిరసన!

Tanuku: న్యూ ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలను, ప్రతిపక్షాలు నిర్వహించిన ధర్నా కార్యక్రమాన్ని నిరోధించడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండించి, జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని ఇరగవరం సిపిఎం పార్టీ, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో పొదలాడ గ్రామంలో ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కామన మునిస్వామి మాట్లాడుతూ దేశంలో బిజెపికి అనుకూలంగా ఆర్ఎస్ఎస్ కు తొత్తుగా పనిచేస్తున్న ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేసి, దేశంలో తొలగించిన 13 కోట్ల ఓట్లను మరల పునరుద్దించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎన్నికల కమిటీలో ముగ్గురు సభ్యులు ఉండగా ఇద్దరి సభ్యులు జ్ఞానేశ్ కుమార్ ప్రతిపాదనలను 14 సార్లు వ్యతిరేకించిన ఎటువంటి చర్యలు తీసుకోకుండా నియంతగా తాను సొంత నిర్ణయాలతో బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఇది దుర్మార్గమైన చర్యన్నారు. రాజీనామా చేయని పక్షంలో భవిష్యత్తులో ప్రజా సంఘాలు కలిసివచ్చే పార్టీలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ జిత్తుగా రామాంజనేయులు సిపిఎం పార్టీ సభ్యులు దంపబాయ్న విజయలక్ష్మి కనికేశ్వరరావు, కేత సత్యనారాయణ పాల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)