Narasapuram: బీజీబీఎస్ ఉమెన్స్ కాలేజీ ఆస్తుల పరిరక్షణకు సీపీఎం ఆధ్వర్యంలో నిరసన!
Narasapuram: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో బీజీబీఎస్ ఉమెన్స్ కాలేజీ ఆస్తుల పరిరక్షణ, అక్రమాలపై సమగ్ర విచారణ కోరుతూ సీపీఎం భారీ ర్యాలీ, నిరసన.
Narasapuram: బీజీబీఎస్ ఉమెన్స్ కాలేజీ ఆస్తుల పరిరక్షణకు సీపీఎం ఆధ్వర్యంలో నిరసన!
Narasapuram: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని బి.జి.బి.ఎస్. ఉమెన్స్ కాలేజీలో జరుగుతున్నట్లు ఆరోపిస్తున్న అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని, మెన్స్ కాలేజీకి సంబంధించిన ఆస్తులు నిర్వీర్యం కాకుండా పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
వైన్ కళాశాల నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు సీపీఎం నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాలేజీ ఆస్తుల పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని, కళాశాలలో జరుగుతున్న వ్యవహారాలపై రిటైర్డ్ జడ్జి అద్దేపల్లి సర్వేశెట్టి ఆధ్వర్యంలో న్యాయ విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
కళాశాల ఆస్తులు, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సీపీఎం నాయకులు పేర్కొన్నారు. సంబంధిత అంశాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, పలువురు ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.




