Tanuku: మున్సిపల్ పోరులో ఉమ్మడిగా సీపీఐ, సీపీఎం పోటీ

Tanuku: పశ్చిమ గోదావరి జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం పార్టీలు ఉమ్మడి అభ్యర్థులను బరిలో నిలపాలని తణుకు సంయుక్త సమావేశంలో నిర్ణయించాయి.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 10 Oct 2026 6:49 PM IST
Tanuku
X

Tanuku: మున్సిపల్ పోరులో ఉమ్మడిగా సీపీఐ, సీపీఎం పోటీ

Tanuku: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లో సీపీఐ, సీపీఎం వామపక్ష అభ్యర్థులను ఉమ్మడిగా బరిలో నిలిపి, వారి విజయానికి సమన్వయంతో కృషి చేయాలని వామపక్ష పార్టీల జిల్లా నాయకత్వం నిర్ణయించింది. శనివారం తణుకు సురాజ్య భవన్‌లో జరిగిన సీపీఐ, సీపీఎం జిల్లా స్థాయి సంయుక్త సమావేశంలో

సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, సీపీఎం జిల్లా కార్యదర్శి జెఎన్వీ గోపాలన్ మాట్లాడారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో వామపక్ష అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా, నిర్విరామంగా కృషి చేయాలని కోరారు.

ఏ మున్సిపాలిటీలోనూ, ఏ వార్డులోనూ సీపీఐ, సీపీఎం పార్టీలు పరస్పరం పోటీకి దిగకుండా పరస్పర అవగాహనతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు. వామపక్ష ఐక్యతతో ఎన్నికలను ఎదుర్కొని ఉమ్మడి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో సీపీఐ, సీపీఎం నాయకులు పీవీ ప్రతాప్, బొద్దాని నాగరాజు, కర్రి నాగేశ్వరరావు, బండి సత్యనారాయణ, బి. వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)