Tanuku: తణుకు జిల్లా ఆస్పత్రిలో కలెక్టర్ నాగరాణి ఆకస్మిక తనిఖీ
Tanuku: తణుకు జిల్లా ఆసుపత్రిని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు ఓపిక, వాత్సల్యంతో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
Tanuku: తణుకు జిల్లా ఆస్పత్రిలో కలెక్టర్ నాగరాణి ఆకస్మిక తనిఖీ
తణుకు: తణుకు నియోజకవర్గ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా తణుకు జిల్లా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. డయాలసిస్ కేంద్రాన్ని స్వయంగా పరిశీలించి రోగులకు పొందుతున్న సేవలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఒ పి విభాగంలోని రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, మందుల పంపిణీ వంటి అంశాలను పరిశీలించారు. ఆస్పత్రి సందర్శించే ప్రతి వ్యక్తికి ఎంతో ఓపికగా, వాత్సల్యంతో సేవలను అందించాలని వైద్యాధికారులకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ కె. సాయికిరణ్, ఆర్ఐవో డాక్టర్ సాయిబాలాజీ, మున్సిపల్ కమిషనర్ టి.రామ్ కుమార్, ఎమ్మార్వో అశోక్ వర్మ, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.




