Kovvuru: కోవూరులో స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు కలెక్టర్
Kovvuru: నియోజకవర్గ పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రిసెప్షన్, స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా గురువారం పరిశీలించారు.
Kovvuru: కోవూరులో స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు కలెక్టర్
Kovvuru: కోవూరు నియోజకవర్గ పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు.
కోవూరు సమీపంలోని జీవనజ్యోతి జూనియర్ కళాశాలలో ఇందుకూరుపేట, కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం, విడవలూరు, కొడవలూరు మండలాలకు సంబంధించి ఏర్పాటు చేయనున్న రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ సెంటర్ గదులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ సెంటర్లలో బారికేడింగ్ పక్కాగా చేపట్టాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్, మంచినీరు మొదలైన కనీస సౌకర్యాలకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సిబ్బంది రాకపోకలకు, పోలింగ్ సామగ్రి తరలింపునకు, వాహనాల రాకపోకలు, పార్కింగ్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట నెల్లూరు, కావలి ఆర్డీవోలు అనూష, ఎలీషా బాబు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.




