Polavaram: వరద పరిస్థితిపై కలెక్టర్ దినేష్ కుమార్ టెలికాన్ఫరెన్స్!

Polavaram: సెలవులో ఉన్నప్పటికీ భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించిన కలెక్టర్ దినేష్ కుమార్.

RAJESH REDDY, CHINTOOR
Published on: 24 Sept 2026 1:42 PM IST
Polavaram
X

Polavaram: వరద పరిస్థితిపై కలెక్టర్ దినేష్ కుమార్ టెలికాన్ఫరెన్స్!

Polavaram: పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సెలవులో ఉన్నప్పటికీ అత్యవసర సేవల నేపథ్యంలో అంకితభావంతో విధులు నిర్వర్తించారు.జిల్లాలో భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో గోదావరి,శబరి నదుల వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

అధికారులు పూర్తి ముందస్తు సన్నద్ధతతో పనిచేయాలని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ ఆదేశించారు.టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి వర్షాలు,వరద పరిస్థితి, పునరావాసం,సహాయక చర్యల పై సమీక్షించారు.

గోదావరి నదికి 12 నుంచి 14 లక్షల క్యూసెక్కుల వరద నీరు, శబరి నదిలోకి సుమారు 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో నదీ ప్రవాహాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ నెల 26 నుంచి 28 తేదీల మధ్య వరద తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున చివరి నిమిషంలో ఏర్పాట్లు చేయకుండా ఇప్పటి నుంచే అవసరమైన చర్యలను పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.

ముఖ్యంగా శబరి పరివాహక ప్రాంతాలు,లోతట్టు ప్రాంతాలు, కట్‌ఆఫ్ అయ్యే ప్రాంతాల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన తెలిపారు.వరద ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలను అవసరమైన సమయంలో ఆలస్యం లేకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR